అవినీతిని ఉపేక్షించం

ట్రైకార్‌ రుణాల మంజూరులో అవినీతిని గుర్తించిన డిప్యూటీ సీఎం

గురుకులాల నిర్మాణం కోసం తక్షణ చర్యలు చేపట్టాలి

సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి

అమరావతి:ట్రైకార్‌ రుణాల మంజూరులో అవినీతిని ఉపేక్షించమని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమ శాఖ పనితీరుపై çసచివాలయంలో ఆమె సమీక్ష నిర్వహించారు. ట్రైకార్‌ రుణాల మంజూరులో అవినీతిని ఆమె గుర్తించారు. నష్టాల్లో ఉన్న జీసీసీని లాభాల్లోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మిని గురుకులాల్లో చదివే విద్యార్థులకు పూర్తిస్థాయి హాస్టల్‌ వసతి, 31 గురుకులాల నిర్మాణం కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గిరిజన ప్రాంతాల్లో జీవో 3ని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారిమళ్ల కుండా చర్యలు తీసుకోవాలని,ఏకలవ్య పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top