ఎస్సీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదు 

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

అమ‌రావ‌తి: ఎస్సీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి అసలు లేదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. చంద్రబాబుతో పని చేసే వారు అంత అభివృధి నిరోధకుల‌న్నారు. బుధ‌వారం మీడియా పాయింట్ వ‌ద్ద నారాయ‌ణ‌స్వామి మాట్లాడారు.

  • ఎస్సీల ఓట్లను హరించి రిగ్గింగులు చేసే సంస్కృతి చంద్రబాబుది 
  • ఏనాడైనా బలహీన వర్గాలని ఇంటికి పిలిచి గుక్కెడు నీళ్ళైనా చంద్రబాబు ఇచ్చాడా? 
  • ఓట్ల మీద ఉన్న ప్రేమ పేదలమీద బాబుకు లేదు 
  • బడుగు, బలహీన వర్గాలను రాజ్యాధికారం వైపు సీఎం జగన్ నడిపిస్తున్నారు 
  • అహంకారంతో, అక్కసుతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు 
  • చంద్రబాబు ఏ పార్టీకి అధ్యక్షుడో అర్ధం కావటం లేదు 
  • చంద్రబాబు మాట మాటకి నన్ను ఉద్దేశించి మాట్లాడారు.
  • బానిసనని విమర్శిస్తున్నారు.
  • చంద్రబాబుకి దళితులు అంటే వ్యతిరేకం.
  • నా శాఖలో నేను ఏ విధంగా పనిచేశానో ప్రజలకు తెలుసు
  • ఇప్పటివరకు నేను ఎవరికీ తలవంచలేదు
  • అవినీతి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదు
  • ఎస్సీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి అసలు లేదు.
  • నాకు సీఎం వైయ‌స్‌ జగన్ అవకాశం ఇచ్చారు.
  • రాష్ట్రపతి దగ్గరికి డైరెక్ట్‌గా వెళ్ళే పదవి నాకు కల్పించారు.
  • నా జీవితంలో నేను పేద వారికి సేవ చేసే అవకాశం లభించింది.
  • చంద్రబాబు పెద్ధిరెడ్డిని దోపిడీ చేశారు అంటున్నారు.
  • రాష్ట్రంలో సీఎం వైయ‌స్ జగన్‌ను, చిత్తూరులో పెద్దిరెడ్డిని వీరు ఏమీ చేయలేరు. 
  • అందుకే ఆరోపణలు చేస్తున్నారు.
  • గతంలో హెరిటేజ్ వాహనంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ జరిగింది వాస్తవం కాదా?
  • హైదరాబాద్‌లో 100 కోట్ల ప్యాలస్ కట్టుకున్నది ఎవరు?
  • ఒక దళిత నియోజవర్గానికి ఏం చేశారో చెప్పాలి. 
  • చంద్రబాబు ముఖ్యమంత్రిగా చిత్తూరు జిల్లాకు ఏం చేశారో చెప్పాలి. 
  • చంద్రబాబుతో పని చేసే వారు అంత అభివృధి నిరోధకులు.
Back to Top