సామాజిక న్యాయం సీఎం వైయ‌స్ జగన్ వల్లే సాధ్యం 

డిప్యూటీ సీఎం అంజాద్ బాషా 

హిందూపురంలో సామాజిక సాధికార బ‌స్సు యాత్ర‌

 హిందూపురం:  సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ వల్లే సాధ్యమని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జరిగిన మేలు వివరించేందుకే బస్సు యాత్ర చేపట్టామన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు వెనుకబడిన వర్గాలను విస్మరించారన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు కులవృత్తులకే పరిమితం కావాలని చంద్రబాబు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. ఐఏఎస్ , ఐపీఎస్ వంటి ఉన్నత హోదాల్లో వెనుకబడిన వర్గాల వారు ఉండాలని వైయ‌స్ జగన్ ఆకాంక్ష అని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో బాలకృష్ణను ఓడిస్తామన్నారు. వైయ‌స్ జగన్ పాలనతో టీడీపీ కంచుకోటలు బద్ధలవుతాయని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైయ‌స్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పాలన కొనసాగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో బాలకృష్ణను ఓడించాలన్నారు.

Back to Top