విజయవాడ: ముస్లింలకు మేలు చేసినవారిని ఎన్నడూ మరవరని డిప్యూటీ సీఎం అంజాద్‌బాష అన్నారు. నాడు దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాకు మేలు చేశారని కొనియాడారు. సమసమాజ స్ధాపనే లక్ష్యంగా శ్రమిస్తున్న మన వైయస్ జగన్ మరో నాలుగు దశాబ్ధాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని పేర్కొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మైనార్టీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా మాట్లాడారు. అందరికీ నమస్కారం, భారతదేశ విద్యాప్రధాత మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, ఎంతోమంది మహానుభావులను ఆదర్శంగా తీసుకుని కులమతవర్గాలకు అతీతంగా ప్రజారంజకపాలన అందిస్తున్న మన సీఎంగారి కేబినెట్‌లో మొట్టమొదటి ముస్లిం మైనార్టీ ఉప ముఖ్యమంత్రిగా, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను, 2005లో జస్టిస్ సచార్ కమిటీ నివేదిక ప్రకారం ముస్లింలు చాలా వెనకబడి ఉన్నారని నివేదించారు కానీ ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు, కానీ నాడు వైయస్‌ఆర్ గారు ముస్లింలకు రిజర్వేషన్లు తీసుకొచ్చారు, దాంతో ఎంతోమంది అవకాశాలు పొందారు, ఆ తర్వాత ఆయన తనయుడు మన సీఎంగారు ముస్లిం మైనార్టీలకు రాజకీయ సాధికారత కల్పించారు, గతంలో చంద్రబాబు ఒక్క ముస్లిం ఎమ్మెల్యేనైనా గెలిపించుకున్నాడా, ముస్లింలపై కపట ప్రేమ చూపాడు, కానీ మన సీఎంగారు దేశంలో ఎక్కడా లేని విధంగా తన క్యాబినెట్‌లో 5 గురు ఉప ముఖ్యమంత్రులుగా చేశారు, అందులో నన్ను ఉప ముఖ్యమంత్రిని చేశారు, నలుగురు ముస్లిం ఎమ్మెల్సీలలో ఒక మహిళకు తొలిసారి అవకాశం ఇచ్చారు, ముస్లిం సోదరులు నలుగురిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు, క్రైస్తవ సామాజికవర్గం నుంచి కూడా ఒకరిని సలహాదారుగా నియమించారు, దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సిక్కులకు సిక్కు కార్పొరేషన్, జైన్ సోదరులకు జైన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, అన్ని వర్గాలకు సమన్యాయం జరిగినప్పుడే అభివృద్ది ఫలాలు కూడా అందరికీ అందుతాయని నమ్మే వ్యక్తి మన సీఎంగారు, తాను నమ్మిన సిద్దాంతాన్ని చేతల్లో చూపించారు, 137 కార్పొరేషన్లలో 79 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చైర్మన్ పదవులు ఇచ్చారు, 12 మంది మైనార్టీలకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చారు, అనేకమందికి డైరెక్టర్లుగా ఇచ్చారు, పదవులలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి ముస్లిం మహిళకు ఇచ్చారు, స్ధానిక సంస్ధలలో అనేకమంది మైనార్టీలకు అవకాశం ఇచ్చారు, గతంలో ఇంతమంది మైనార్టీలు ఏనాడైనా ప్రభుత్వంలో ఉన్నారా, విద్య విషయానికి వస్తే మన సీఎంగారు విద్యార్ధులను గ్లోబల్ చాంపియన్‌లుగా తీర్చిదిద్దుతున్నారు, పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చారు, విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు, ఉర్ధూ విద్యార్ధులకు బైలింగువల్ బుక్స్ ఇచ్చారు, ఇది మైనార్టీలకు ఒక సువర్ణ అధ్యాయం, గత టీడీపీ ప్రభుత్వం మైనార్టీలను పక్కనపెడితే మన సీఎంగారి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చుపెట్టింది రూ. 23,414 కోట్లు. దీని ద్వారా లక్షలాది మంది మైనార్టీలు లబ్ధిపొందారు, గత ప్రభుత్వం ఉర్ధూబాషను విస్మరిస్తే ఈ ప్రభుత్వం ఏపీలో ఉర్ధూను రెండో అధికార భాషగా గుర్తిస్తూ దాని అమలుకు అవసరమైన చర్యలు చేపడుతుంది. సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత కల్పించిన ప్రభుత్వం ఇది, హజ్ యాత్రికులపై ఆర్ధిక భారం విషయం సీఎంగారి దృష్టికి తీసుకెళితే 24 గంటల్లోనే జీవో రిలీజ్ చేసి ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించింది, అంతేకాదు 48 గంటల్లో ప్రతి యాత్రికుడి అకౌంట్‌లో రూ. 80 వేలు జమ చేసిన ఘనత మన సీఎంగారిది. ముస్లింలకు మేలు చేసినవారిని ఎన్నడూ మరవరు, నాడు వైఎస్సార్ గారు ఇప్పుడు మీరు మాకు మేలు చేశారు, సమసమాజ స్ధాపనే లక్ష్యంగా శ్రమిస్తున్న మన సీఎంగారు ఏపీని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో నాలుగు దశాబ్ధాల పాటు సీఎంగా ఈ రాష్ట్రాన్ని పాలించే శక్తిని ఇవ్వాలని అల్లాని ప్రార్ధిస్తున్నాను, సెలవు.