వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు 

తాడేపల్లి :  వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో రాజ్యంగ దినోత్స‌వ వేడుక‌లు రాష్ట్ర‌వ్యాప్తంగా ఘనంగా  జరిగాయి. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పార్టీ నేతలు డా.బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు, మల్లాది విష్ణు, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, మంగళగిరి ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, తదితరులు కార్య‌క్ర‌మంలో పాల్గొని రాజ్యంగం గొప్ప‌త‌నాన్ని గుర్తు చేశారు. 

తిరుపతి
మాజీ మంత్రి పెద్దిరెడ్డి క్యాంపు కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు జరిగాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర నేత మల్లారపు మధు భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగ అమలు దినోత్సవం వేడుకల దేశం అంతా ఘనంగా జరుపుకుంటున్నాం. బి.ఆర్. అంబేద్కర్ చిరస్మరణీయుడు, అట్టడుగు వర్గాలు ,బలహీన వర్గాలకు రక్షణ కల్పించేలా భారత రాజ్యాంగం నిర్మించారు. బి.ఆర్.అంబేద్కర్ పూర్తి తెలివితేటలు,సమాజ అవసరాలు కలిపి రాజ్యాంగం రాయడం జరిగింది భావితరాలకు భారత రాజ్యాంగం ద్వారా సమాజంలో సమతుల్యత చేకూరుస్తోందని ఆయన అన్నారు.

విశాఖపట్నం
వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలల వేసి నివాళులర్పించిన ఎంపీ గొల్ల బాబురావు, వరుదు కళ్యాణి, కేకే రాజు, వాసుపల్లి, మోల్లి అప్పారావు, కొండ రాజీవ్ గాంధీ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ గొల్ల బాబురావు మాట్లాడుతూ.. ఆర్ధిక, సామాజిక రాజకీయ రుగ్మతలను రాజ్యాంగం తొలగించింది. ప్రపంచంలో అత్యంత శక్తి వంతమైన రాజ్యాంగం మనది. రాష్ట్రంలో నేడు రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలకు కూటమి పాలనలో అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు.

కేకే రాజు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. అంబేద్కర్ ఆశయాలను కూటమి ప్రభుత్వం కాలరాస్తోంది. అంబేద్కర్ రాజ్యాగాన్ని కాదని రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. అంబేద్కర్ ఆశయాలను వైయ‌స్ జగన్ అమలు చేశారు. బడుగు బహిన వర్గాల వారికి వైయ‌స్ జగన్ రాజ్యాధికారం కల్పించారు అని అన్నారు.

అనంత‌పురం:
భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవంను పురస్కరించుకుని అనంతపురం జిల్లా కేంద్రంలోని వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి  పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా అంబేద్క‌ర్ సేవ‌ల‌ను స్మ‌రించారు.

మంగళగిరి:
రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మంగళగిరి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి , ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు పాల్గొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మన దేశంలోనే కాక అనేక దేశాలలో వాళ్ల రాజ్యాంగాలలో మన రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుని దేశాలను పరిపాలన చేస్తున్నారని అలాంటి మహానుభావుడిని ఈరోజు మనం స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఆయన రచించిన రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు రాజ్యాంగం విధానంలో నడుస్తున్నాయో ప్రభుత్వాలు ఆలోచించాలి అన్నారు. 

విజయవాడ
ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు జరిగాయి. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు కార్పొరేటర్లు, పాల్గొన్నారు.

<iframe width="914" height="514" src="https://www.youtube.com/embed/SgKLXb4LsGY" title="Live🔴:  &quot;భారత రాజ్యంగ ఆమోద దినోత్సవ వేడుకలు&quot; - తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయం" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Back to Top