రాజ్యాంగ స్ఫూర్తితో సీఎం వైయస్‌ జగన్‌ పాలన

వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, నేతలు

తాడేపల్లి: భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు శ్రీ ఆదిమూలపు సురేష్, శ్రీచెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపి శ్రీ నందిగమ్ సురేష్, ఎంఎల్సిలు శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీ జంగాకృష్ణమూర్తి,ప్రభుత్వ సలహాదారులు శ్రీ జూపూడి ప్రభాకర్,మహిళా శిశుసంక్షేమశాఖ సలహాదారులు శ్రీమతి నారమల్లి పద్మజ, ఎస్సి కార్పోరేషన్ ఛైర్మన్ లు శ్రీమతి అమ్మాజి, కొమ్మూరి కనకారావు, కాపు కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ అడపా శేషు, నవరత్నాల అమలు ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ శ్రీ నారాయణమూర్తి, గ్రంధాలయపరిషత్ రాష్ర్ట ఛైర్మన్ శ్రీ మందపాటి శేషగిరిరావు, తదితరులు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  

రాష్ట్ర మంత్రులు శ్రీ ఆదిమూలపు సురేష్, శ్రీచెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

        భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు శ్రీ ఆదిమూలపు సురేష్, శ్రీచెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపి శ్రీ నందిగమ్ సురేష్, ఎంఎల్సిలు శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీ జంగాకృష్ణమూర్తి,ప్రభుత్వ సలహాదారులు శ్రీ జూపూడి ప్రభాకర్,మహిళా శిశుసంక్షేమశాఖ సలహాదారులు శ్రీమతి నారమల్లి పద్మజ, ఎస్సి కార్పోరేషన్ ఛైర్మన్ లు శ్రీమతి అమ్మాజి, కొమ్మూరి కనకారావు, కాపు కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ అడపా శేషు, నవరత్నాల అమలు ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ శ్రీ నారాయణమూర్తి, గ్రంధాలయపరిషత్ రాష్ర్ట ఛైర్మన్ శ్రీ మందపాటి శేషగిరిరావు, తదితరులు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 

        రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంబేద్కర్ ఆలోచనా విధానంతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ముందుకు వెళ్తూ,  సుపరిపాలన అందిస్తున్నారని రాష్ట్ర మంత్రులు శ్రీ ఆదిమూలపు సురేష్, శ్రీచెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు.  రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన బాటలో..  శ్రీ వైయస్ జగన్ పరిపాలన అందిస్తూ,  అణగారిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సమాజంలో వెనకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా, విద్యాపరంగా, పారిశ్రామికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలనే ధ్యేయంతో అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో రాజ్యాంగం అంటే ఏమాత్రం గౌరవం లేకుండా ప్రవర్తించడమే కాకుండా, రాజ్యాంగాన్ని అపహస్యం చేసే విధంగా వ్యవహరించారని విమర్శించారు. నేటీకి చంద్రబాబు తీరు అదేరీతిలో ఉండగా, ఆయన దత్తపుత్రుడు పరిస్దితి కూడా అందుకు తీసిపోని విధంగా తయారైందని అన్నారు.  

- గత టీడీపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరించింది.
- చట్టసభలను కించపరచడం, ప్రతిపక్షాలను అవమానిస్తూ, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం వంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు. 
- డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలాన్ని పుణికిపుచ్చుకుని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ రాజ్యాంగస్పూర్తిని తూచ తప్పకుండా అమలు చేస్తున్నారు.
- మూడున్నరేళ్లుగా అంబేద్కర్ ఆలోచనావిధానంతో జగన్ గారి పరిపాలన.
- పేదల వెనకబాటుతనం పోగొట్టేందుకు విద్య,వైద్యం,వ్యవసాయానికి లక్షలాది కోట్లరూపాయలు ఖర్చు చేశారు.
- 70 శాతం ఎస్సి,ఎస్టి,బిసి,మైనారిటీవర్గాలకు మంత్రివర్గంలో స్ధానం కల్పించడమే కాకుండా మహిళలకు అన్నిరంగాలలో ముఖ్యమంత్రి జగన్ గారు ప్రోత్సహిస్తున్నారు.

 -  డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక యుగపురుషుడు. సామాన్యుడికి,సంపద కలిగిన వారికి సమానహక్కులు కల్పించారు. 
- సూర్యతేజం ఎలా అయితే అన్ని వస్తువులపై సమానంగా తన కాంతిని ప్రసరిస్తుందో.. అదే విధంగా అందరి హక్కులను సమానంగా సంరక్షించేందుకు ప్రామాణిక గ్రంధం రాజ్యాంగం.
- రాజ్యాంగం ఉంది కాబట్టే తనలాంటి వ్యక్తి కూడా మంత్రిగా ఎదగగలిగారు.అంబేద్కర్ ఆశయసాధకుడు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్.
- ప్రతి ఇంటి అవసరం తెలుసుకుని, వారి వెనకబాటుతనం పోవాలంటే ఏం చేయాలో, అలా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు అని చెప్పారు. 

Back to Top