అన్నివర్గాలకు మేలు చేసే సమగ్ర మేనిఫెస్టో

రాష్ట్రానికి వైయస్‌ జగన్‌ సీఎం కావడం చారిత్రాత్మక అవసరం

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ

అమరావతి: వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో సమాజానికి మేలు చేసేవిధంగా సమగ్రంగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఒక చారిత్రాత్మక అవసరంగా ప్రజలు భావిస్తున్నారన్నారు.మేనిఫెస్టోను పరిశీలిస్తే..సమస్యలతో ఉన్నవారికి వెంటనే ఊరట చెందేవిధంగా ఒక శాశ్వత ప్రతిపాదికన అన్ని హామీలు ప్రణాళికలో ఉన్నాయన్నారు.అన్నివర్గాలు అభివృద్ధి చెందేలా మేనిఫెస్టోను రూపొందించారన్నారు.2014లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఏమేరకు అమలు అయ్యిదంటే చివరికి ఆ మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుంచి తొలగించి దాచుకోవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  కూలంకుషంగా చర్చించి మేనిఫెస్టో రూపొందించారన్నారు.  వైయస్‌ఆర్‌లాగే ఆయన తనయుడు వైయస్‌ జగన్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన  ప్రతి హామీని ఆయన అమలు చేస్తారన్నారు.  ప్రతి సామాన్యుడి లబ్ధి పొందేవిధంగా సమగ్రంగా రూపొందించారు.

Back to Top