టీడీపీ చేసిన పాపాల వల్లే  ఏపీలో భారీగా నకిలీ ఓటర్లు

మాజీ మంత్రి పేర్ని నాని

దొంగ ఓట్లను చేర్చి గెలవాలనే దిక్కుమాలిన ఆలోచన చంద్రబాబుదే.. 
 
వైయ‌స్ఆర్‌ సీపీ సానుభూతి పరుల 50 లక్షల ఓట్లను తొలగించారు

న‌కిలీ ఓట‌ర్ల‌పై రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారికి వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌తినిధుల ఫిర్యాదు

విజ‌య‌వాడ‌:  టీడీపీ చేసిన పాపాల వల్లే ఇప్పుడు ఏపీలో భారీగా నకిలీ ఓటర్లు ఉన్నారని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. టీడీపీ చేసిన తప్పును వైయ‌స్ఆర్‌ సీపీ మీద వేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ధ్వ‌జ‌మెత్తారు. మంగ‌ళ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌తినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని క‌లిసింది. ఈ సంద‌ర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ఎన్నికల ఓటర్ లిస్టులో డూప్లికేట్ ఓటర్లు ఇంకా ఉన్నారని తెలిపారు. ఒకే పేరు.. ఒకే ఐడీ.. ఒకే ఫొటోతో వేర్వేరు చోట్ల ఓట్లు ఉన్నాయి.. దీన్ని సరి చేయాలని ఎన్నికల అధికారిని కోరామని ఆయన పేర్కొన్నారు. 

ఏపీ ఓటర్ లిస్టులో అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ గగ్గోలు పెడుతోంది.. వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వం.. పార్టీ ఓటర్ల జాబితాలో అక్రమాలు పాల్పడుతోందని విమర్శలు చేస్తున్నారు.. బీజేపీ కూడా ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ పదవి పోయిన ఓ నేత వచ్చి మాట్లాడుతున్నారు అని పేర్నినాని అన్నారు.
 
ఉత్తర భారతంలో ఓటర్ల జాబితాలో బీజేపీ అక్రమాలకు పాల్పడినట్టు .. ఇక్కడ కుదురుతుందా?.. అని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. 2019కు ముందు 59.18 లక్షల ఓట్లు అక్రమంగా ఉన్నాయి.. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఓట్లున్న పరిస్థితి ఇప్పటికీ ఉంది.. చాలా అక్రమ ఓట్లు.. 2019 నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి.. ఓటర్ల జాబితాకు ఆధార్ కార్డు అనుసంధానం చేయాలి అని ఈసీని కోరామని ఆయన తెలిపారు. ఓటర్ల జాబితా విషయంలో పాపాలు చేసిన టీడీపీ.. ఇప్పుడు వచ్చి మాపై విమర్శలు చేస్తున్నారు అని పేర్నినాని అన్నారు.

 
దొంగ ఓట్లను చేర్చి గెలవాలనే దిక్కుమాలిన ఆలోచన చంద్రబాబుకే వస్తుంది అని పేర్నినాని అన్నారు. సేవా మిత్ర యాప్ ద్వారా వైయ‌స్ఆర్‌ సీపీ సానుభూతి పరుల 50 లక్షల ఓట్లను తొలగించారు.. గజ దొంగే నీతి కబుర్లు చెబుతున్నట్టు.. ఆవు తోలు కప్పుకున్న నక్కలా చంద్రబాబు ఎత్తుగడలు వేస్తున్నారు.. వైయ‌స్ఆర్‌ సీపీపై చంద్రబాబు బురదజల్లుతున్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై మాజీ మంత్రి పేర్ని నాని సీరియస్ అయ్యారు. ఏపీలో వైయ‌స్ఆర్‌ సీపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు చేస్తోందన్న సంజయ్ కామెంట్లను ఆయన తప్పుబట్టారు. బండి సంజయ్ కు దేవుడు పైన ఊడగొట్టాడు.. బీజేపీ కిందున్న ఛైర్ ఊడగొట్టింది అని ఆయన విమర్శించారు. ప్ర‌తి ఓటును ఆధార్‌తో అనుసంధానం చేయాల‌ని ఎన్నిక‌ల అధికారిని కోరిన‌ట్లు పేర్నినాని తెలిపారు. 

Back to Top