నేడు విజ‌య‌వాడ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేడు విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. సాయంత్రం 6 గంటలకు విజ‌య‌వాడ‌లోని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా నివాసానికి వెళతారు, ఆ తర్వాత అక్కడి నుంచి ఏ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుని జస్టిస్‌ మిశ్రా గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన విందు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఈ నేపథ్యంలో ఆయన గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం విందు స‌మావేశం ఏర్పాటుచేసింది. 

Back to Top