ఈనెల 7న అనకాపల్లిలో సీఎం ప‌ర్య‌ట‌న 

తాడేప‌ల్లి : వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 7న అనకాపల్లిలో ప‌ర్య‌టించ‌నున్నారు. వైయ‌స్ఆర్‌ చేయూత చివరి విడత కార్యక్రమాన్ని అనకాప‌ల్లిలో ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఆదివారం సీఎం ప్రోగ్రామ్స్‌ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జాయింట్‌ కలెక్టర్‌ జాహ్నవి, వైయ‌స్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌లు సభా స్థలిని పరిశీలించారు. అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. స్థానిక ఎన్టీఆర్ క్రీడా మైదానంలో హెలిప్యాడ్‌కు స్థల పరిశీలన చేశారు. 

Back to Top