నేడు అమ‌లాపురంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

అమలాపురం: నేడు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో ప‌ర్య‌టించ‌నున్నారు. తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి ఉద‌యం 9.20 గంట‌ల‌కు బ‌య‌ల్దేరి అమ‌లాపురం చేరుకుంటారు. అమ‌లాపురం మండలం జనుపల్లిలో ఏర్పాటు చేసిన స‌భా ప్రాంగ‌ణానికి చేరుకొని అక్క‌చెల్లెమ్మ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు. అనంత‌రం వ‌రుస‌గా నాల్గ‌వ విడ‌త వైయ‌స్ఆర్ సున్నావ‌డ్డీ ప‌థ‌కం కింద‌ డ్వాక్రా మ‌హిళ‌ల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ చేస్తారు. కార్యక్రమం అనంతరం అమలాపురానికి వచ్చి.. అక్కడి నుంచి తాడేపల్లిలోని త‌న‌ నివాసానికి సీఎం వైయ‌స్‌ జగన్‌ చేరుకుంటారు.

Back to Top