28న విశాఖలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పర్యటన

తాడేప‌ల్లి: ఈనెల 28వ తేదీన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టించ‌నున్నారు.  మంగళవారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని త‌న నివాసం నుంచి సీఎం వైయ‌స్‌ జగన్‌ బయలుదేరి 5.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు రిషికొండ రాడిసన్‌ బ్లూ రిసార్ట్స్‌కు చేరుకుని రాత్రి 7–8 గంటల మధ్య జీ–20 ప్రతినిధులతో జరిగే ఇంటరాక్షన్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అతిథులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘గాలా డిన్నర్‌’లో పాల్గొని రాత్రి 8.45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 10 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.   

Back to Top