తాడేపల్లి: సమాజ భద్రత కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడే పోరాడ యోధుడే పోలీస్ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. ``విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నేడు మన ప్రభుత్వం తరఫున నిర్వహించాం. ఈ ఏడాది మన రాష్ట్రంలో విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సోదరుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను. సమాజ భద్రత కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడే పోరాట యోధుడే పోలీస్. అధునాతన వ్యవస్థలను ఉపయోగించుకుని నేరాలకు పాల్పడుతున్న వారిని ఎదుర్కోవలసిన బాధ్యత నేటి పోలీసులపై ఉంది. నేర నిరోధం, నేర దర్యాప్తులో మన రాష్ట్ర పోలీసులు అత్యాధునిక సైబర్ టెక్నాలజీని ఉపయోగిస్తూ దేశంలోనే అగ్రగామిగా ఉన్నారు. ఈ విభాగంలో నియమించిన 130 మంది సాంకేతిక పోలీసింగ్ నిపుణుల పనితీరు మన ప్రజలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తోంది`` అని సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.