తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు దిగ్విజయంగా ముగిశాయి. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని ప్లీనరీ ప్రాంగణమంతా జనసునామీని తలపించింది. అశేష జనవాహినీని ఉద్దేశించి పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ ఉద్వేగ ప్రసంగాన్ని చేశారు. నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్లీనరీ విజయవంతం సందర్భంగా సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. ``నిరంతరం– దేవుని దయ, నడిపించే నాన్న, ఆశీర్వదించే అమ్మ, ప్రేమించే కోట్ల హృదయాలు.. ఇవే నాకు శాశ్వత అనుబంధాలు! కార్యకర్తలూ అభిమానుల సముద్రంగా మారిన ప్లీనరీలో.. చెక్కు చెదరని మీ ఆత్మీయతలకు, మనందరి పార్టీకి, ప్రభుత్వానికి మీ మద్దతుకు.. మీ జగన్ సెల్యూట్, మరోసారి!`` అంటూ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.