కాసేపట్లో ‘స్పందన’పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

కోవిడ్‌ కట్టడి చ‌ర్య‌ల‌పై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్న సీఎం

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ‘స్పందన’పై సమీక్షా సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా కరోనా కట్టడి చర్యలపై జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఆక్సిజన్‌ సరఫరా, వ్యాక్సినేషన్‌పై కీలకంగా చర్చించనున్నారు. అదే విధంగా ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ ప్రారంభాలపై సమీక్షించనున్నారు. వైయస్‌ఆర్‌ రూరల్‌ – అర్బన్‌ క్లినిక్స్, వైయస్‌ఆర్‌ జలకళపై చర్చించనున్నారు. రానున్న ఖరీఫ్‌ సీజన్‌ సన్నద్ధతపై, విత్తనాలు, ఎరువుల పంపిణీ, రైతులకు రుణ సౌకర్యాలపై చర్చిస్తారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలపై సమీక్షించనున్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top