సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కాకినాడ ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌..

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడ‌లోని గొల్ల‌ప్రోలులో వైయ‌స్ఆర్‌ కాపు నేస్తం పథకం మూడో విడత సాయం కంప్యూట‌ర్ బ‌ట‌న్ నొక్కి విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని త‌న నివాసం నుంచి కాకినాడ ప‌ర్య‌ట‌న‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బ‌య‌ల్దేర‌నున్నారు. 10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకుంటారు. 10.45 గంట‌ల నుంచి 12.15 గంటల వరకు బహిరంగ సభా ప్రాంగణం నుంచి అక్క‌చెల్లెమ్మ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంత‌రం వైయ‌స్ఆర్‌ కాపు నేస్తం పథకం సహాయం విడుదల చేస్తారు. మధ్యాహ్నం 12.40 గంటల‌కు గొల్ల‌ప్రోలు నుంచి  నుంచి తిరుగు ప్ర‌యాణ‌మ‌వుతారు. 1.30 గంటలకు తాడేపల్లికి సీఎం చేరుకోనున్నారు.

తాజా వీడియోలు

Back to Top