రేపు సీఎం వైయ‌స్‌ జగన్‌ కర్నూలు పర్యటన

ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కుమారుడి పెళ్లికి హాజరు

క‌ర్నూలు: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (బుధవారం) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు సీఎం వైయ‌స్‌ జగన్‌ తాడేపల్లిలోని తన ఇంటి నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కర్నూలు రూరల్‌ మండలం పంచలింగాల గ్రామానికి చేరుకుంటారు.

అక్కడ స్థానిక నాయకులతో మాట్లాడతారు. ఆ తర్వాత పంచలింగాలలో పాణ్యం వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కుమారుడు శివ నరసింహారెడ్డి పెళ్లికి హాజరవుతారు. అనంతరం తిరిగి బుధవారం మధ్యాహ్నం 12.20 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి కర్నూలు విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.50 గంటలకు తాడేపల్లిలోని ఇంటికి చేరుకుంటారు.  

 

Back to Top