నేడు ప్రజలందరికీ పర్వదినం

ఘనంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పుట్టినరోజు వేడుకలు
 

అమ‌రావ‌తి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ పర్వ‌దినంగా మారింది. పుట్టిన రోజు వేడుక‌లు మంగ‌ళ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు.  ఈ సంవత్సరం ప్రధానంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పార్టీ నిర్ణయించిందన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో  సీఎం వైయ‌స్‌ జగన్‌ పుట్టిన రోజు వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు.  వంటిదన్నారు. అందుకే ఆ రోజు సేవా కార్యక్రమాలతోపాటు ప్రత్యేకంగా ప్రజల్లో అవగాహన పెంచే విధంగా ఏదో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు.

 విజయవాడ సత్యనారాణయపురంలో సీఎం వైయ‌స్ జగన్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు,.. కార్పొరేటర్లు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. అనంతరం రోడ్లపై నిద్రిస్తున్న యాచకులకు, వృద్ధులకు.. దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. 

అనంతపురం జిల్లా
ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా మంత్రి శంకర నారాయణ పెనుకొండ బీసీ బాలుర హాస్టల్‌ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా
►పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయి గూడెం మండలం ముప్పిన వారి గూడెంలో ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

►సీఎం వైయ‌స్ జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
►మొక్కలు నాటి, శివాలయంలో పత్యేక పూజలు చేసిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు

 
 

తాజా వీడియోలు

Back to Top