ప్ర‌తి పౌరుడు ఒక మొక్క‌ను నాటాలి

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు
 

అమరావతి : రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఒక మొక్కను నాటాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.  సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం వైయ‌స్‌ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మొత్తం 5 కోట్ల మంది ఐదు కోట్ల మొక్కలను నాటాలని తన ఆలోచన అన్నారు. మొక్కలను నాటే కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లను భాగస్వాములుగా చేయాలని కలెక్టర్లకు సూచించారు. స్కూళ్లు, ఆస్పత్రులలో చెట్లను నాటేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెట్ల సంరక్షణ బాధ్యతలను సీఎస్‌ఆర్‌ కింద పరిశ్రమలకు ఇవ్వాలని సూచించారు. మొక్కలు నాటడం, సంరక్షణపై శ్రద్ధ చూపాలన్నారు. 

ఉచిత విద్యుత్‌పై చ‌ర్చ 
రైతులకు ఉచిత విద్యుత్‌ అంశాన్ని ప్రాధన్య అంశంగా భావించి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జనన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో రైతులకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌పై చర్చించారు. ఉచిత విద్యుత్‌ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫీడర్ల వారిగా ప్రణాళిక ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రంలో ఎన్ని పంపుసెట్లకు కనెక్షన్లు ఇవ్వాలని అధికారులను సీఎం జగన్‌ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 57వేలకు పైగా పంపుసెట్లకు కనెక్షన్లు ఇవ్వాలని అధికారులు సీఎంకు తెలిపారు. నిర్ణిత సమయంలో వాటిని పూర్తి చేయాలని సీఎం వైయ‌స్ జగన్‌ ఆధికారులను ఆదేశించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top