తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటుదాం

తాడేపల్లి: తెలుగు భాష ఔన్నత్యాన్ని సగర్వంగా చాటుదామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా గురువారం తెలుగు భాషా దినోత్సవం జరుపుకొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు భాషాభివృద్ధికి గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన విశేష కృషిని స్మరించుకుంటూ, తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.  
 

Back to Top