ఈనెల 6న కర్నూలు జిల్లాకు సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6వ తేదీన (ఎల్లుండి) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లా అవుకు వెళ్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతిచెందిన వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణ కుటుంబాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం షెడ్యూల్‌ను విడుదల చేసింది.

Back to Top