రేపు సీఎం వైయ‌స్‌ జగన్‌ విజయవాడ, నెల్లూరు పర్యటన

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు(07.12.2022) విజ‌య‌వాడ‌, నెల్లూరు జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న జయహో బీసీ మహాసభకు ముఖ్య‌మంత్రి హాజరుకానున్నారు. అనంత‌రం నెల్లూరు రూరల్‌ మండలం కనపర్తిపాడు వీపీఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొననున్న సీఎం శ్రీ వైయ‌స్‌ జగన్‌.

ఉదయం 11.50 – మధ్యాహ్నం 1.00 గంట వరకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న జయహో బీసీ మహాసభకు హాజరుకానున్న సీఎం, తర్వాత 2.00 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 3.25 గంటలకు నెల్లూరు రూరల్‌ మండలం కనపర్తిపాడు చేరుకుంటారు. 3.55 – 4.10 వీపీఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 6.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం.

Back to Top