కాసేపట్లో ఆళ్లగడ్డకు సీఎం వైయస్‌ జగన్‌

నంద్యాల: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాసేపట్లో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చేరుకోనున్నారు. ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పర్యటనకు బయల్దేరిన సీఎం.. మరికాసేపట్లో చేరుకోనున్నారు. వరుసగా నాలుగో ఏడాది రెండో విడత వైయస్‌ఆర్‌ రైతు భరోసా సాయం ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన సభా వేదిక నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50.92 లక్షల మంది రైతన్నల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.2,096 కోట్ల రైతుభరోసా సాయం సీఎం వైయస్‌ జగన్‌ జమ చేయనున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top