తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పి. గన్నవరం జెడ్పీ హైస్కూల్‌లో ‘మనబడి నాడు-నేడు’ ద్వారా పూర్తి అయిన తొలి విడత పనులను ప్రారంభించారు. ‘మనబడి నాడు-నేడు’ ద్వారా తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరించారు. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న సందర్భంగా వైయస్ జగన్ వాటిని విద్యార్థులకు అంకితం చేశారు. గన్నవరం స్కూల్‌లోని తరగతి గదులను పరశీలించి గ్రీన్ బోర్డుపై ఆల్ దీ బెస్ట్ అంటూ స్వయంగా రాసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్టాల్‌ను పరిశీలించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్న విద్యా కానుక’ రెండో విడత పంపిణీని రూ.731.30 కోట్లతో ప్రారంభిస్తారు. 8 పాఠశాల వద్ద ఉన్న భవిత కేంద్రం, గ్రంథాలయం, లేబొరేటరీలు పరిశీలించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను సీఎం జగన్ సందర్శిస్తారు. విద్యార్థుల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. టాయిలెట్లను పరిశీలిస్తారు. అనంతరం నాడు-నేడు పైలాన్‌ను ఆవిష్కరించి, పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.