విజయవాడ: విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాతృమూర్తి బాలాత్రిపుర సుందరమ్మ కన్నుమూశారు. దీంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మల్లాది విష్ణు కుటుంబ సభ్యులను పరామర్శించారు. విజయవాడలోని మల్లాది విష్ణు ఇంటికి సీఎం వైయస్ జగన్ వెళ్లి బాలాత్రిపుర సుందరమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం విష్ణు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు సీఎం వైయస్ జగన్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.