అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం

కాసేపట్లో నూతన రథం ప్రారంభోత్సవం

తూర్పుగోదావరి: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామిని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దర్శించుకున్నారు. అంతకు ముందు అంతర్వేది ఆలయ ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌కు.. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు స్వాగతం పలికారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం అర్చన, మంత్ర‌పుష్పం సమర్పణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రాజ్యలక్ష్మి అమ్మవారిని సీఎం వైయస్‌ జగన్‌ దర్శించుకున్నారు. స్వామి, అమ్మ‌వార్ల ద‌ర్శ‌నం అనంత‌రం తీర్థ‌ప్ర‌సాదాలు స్వీక‌రించారు. మరికాసేపట్లో అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి రథాన్ని ప్రారంభించనున్నారు.

Back to Top