11, 12వ తేదీల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ విశాఖ ప‌ర్య‌ట‌న‌

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీతో క‌లిసి ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌నున్న ముఖ్య‌మంత్రి

తాడేప‌ల్లి:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ నెల 11, 12వ తేదీల్లో విశాఖ జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో కలిసి పలు అభివృద్ది, శంకుస్ధాపన కార్యక్రమాల్లో  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి పాల్గొన‌నున్నారు.

11.11.2022 షెడ్యూల్‌
సాయంత్రం 5.05 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం, 6.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. 6.35 గంటలకు ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుని ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం రాత్రికి పోర్ట్‌ గెస్ట్‌హౌస్‌లో బసచేస్తారు. 

12.11.2022 షెడ్యూల్‌
ఉదయం 10.05 గంటలకు ఏయూ గ్రౌండ్‌లోని హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 10.20 గంటలకు ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం పలుకుతారు. 10.30 – 11.45 గంటల వరకు ప్రధానితో కలిసి పలు శంకుస్ధాపనలు, ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవాలలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుని ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. 12.45 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top