విఘ్నాల‌న్నీ తొల‌గి ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి

రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్ష‌లు తెలియజేశారు. ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, అభివృద్ధిలో ముందడుగు వేయాలని అభిలాషించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఎదురవుతున్న ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోవాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షించారు. 
 

తాజా వీడియోలు

Back to Top