తాడేపల్లి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన ‘స్పందన’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం కొనసాగుతోంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు. కోవిడ్ నివారణ చర్యలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఖరీఫ్ సన్నద్ధత, వ్యవసాయ రుణాలపై సీఎం సమీక్షిస్తున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ ప్రగతిపై చర్చిస్తున్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, విలేజ్ క్లినిక్స్ నిర్మాణంపై, గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలపై, ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూముల అభివృద్ధిపై ఉన్నతాధికారులకు సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, డీజీపీ గౌతం సవాంగ్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.