కాసేపట్లో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

తాడేపల్లి: కరోనా నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ కాసేపట్లో ప్రారంభంకానుంది. జిల్లాల వారీగా కరోనా కేసులు, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, వైద్య సదుపాయాలు, 104 సేవలు వంటి తదితర అంశాలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షించనున్నారు. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్‌పై కీలక దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించనున్నారు. అదే విధంగా పలు అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేయనున్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఇప్పటికే రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశారు. కోవిడ్‌ పర్యవేక్షణకు జిల్లాకో ఇన్‌చార్జ్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని నియమించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top