కాసేపట్లో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ 

తాడేపల్లి: కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాసేపట్లో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షించనున్నారు. కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా స్కూళ్లు, ఆస్పత్రులు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు–నేడు పనులపై సమీక్షించనున్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణాల ప్రగతిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఉచిత విద్యుత్‌ – రైతు అకౌంట్‌లో నగదు బదిలీ అంశంపై, అదే విధంగా ఈ నెల 21వ తేదీన ప్రారంభించనున్న వైయస్‌ఆర్‌ బీమాతో పాటు పలు పథకాల ప్రారంభంపై చర్చించనున్నారు. 
 

Back to Top