ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీల‌ను తూచ త‌ప్ప‌కుండా నెర‌వేర్చా..

రెండేళ్ల పాల‌న పూర్తయిన సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌

తాడేప‌ల్లి: దేవుని దయ, ప్రజల దీవెనలతో ఈ రెండేళ్ల కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను, ప్రజలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నెరవేరుస్తూ వచ్చామని​ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసి నేటితో రెండేళ్లు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా సంక్షేమ పాల‌న‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. ‘‘ప్రజలకు నేరుగా రూ.95,528 కోట్లు.. ఇతర పథకాల ద్వారా మరో రూ.36,197 కోట్లు .. మొత్తంగా రూ.1.31 లక్షల కోట్లు అందించగలిగాం. ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వగలిగాం. ఇంకా మంచి చేయడానికి మీ బిడ్డగా, మీ ముఖ్యమంత్రిగా, మీ కుటుంబ సభ్యుడిగా మరింత తాపత్రయ పడతాను. మీరు ఇచ్చిన ఈ అధికారంతో అనుక్షణం.. ప్రజాశ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన అందిస్తానని మరోసారి స్పష్టం చేస్తున్నానని’’ సీఎం వైయ‌స్‌ జగన్ ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top