త్యాగానికి ప్ర‌తీక మొహ‌ర్రం

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి: పవిత్ర‌మైన ఈ మొహ‌ర్రం సంతాప దినాలు రాష్ట్రంలో మ‌త స‌మైక్య‌త‌కు ప్ర‌తీక‌గా నిలుస్తాయని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. మొహ‌ర్రం సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. ``త్యాగానికి ప్ర‌తీక మొహ‌ర్రం. న‌మ్మిన సిద్ధాంతం కోసం క‌ష్ట‌న‌ష్టాల‌ను భ‌రించి, ఆత్మ బలిదానానికి కూడా సిద్ధ‌పడిన మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త మ‌న‌వ‌డు ఇమామ్ హుస్సేన్ జీవితం అంద‌రికీ ఆద‌ర్శం. పవిత్ర‌మైన ఈ మొహ‌ర్రం సంతాప దినాలు రాష్ట్రంలో మ‌త స‌మైక్య‌త‌కు ప్ర‌తీక‌గా నిలుస్తాయి`` అని సీఎం ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top