వైయస్‌ఆర్‌ జిల్లాకు బయల్దేరిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్‌ఆర్‌ జిల్లా పర్యటనకు బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి విమానంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో ఇడుపులపాయలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.  అనంతరం రోడ్డు మార్గంలో వైయస్‌ఆర్‌ ఎస్టేట్‌కు చేరుకుంటారు. రాత్రి వైయస్‌ఆర్‌ గెస్ట్‌హౌస్‌లోనే సీఎం వైయస్‌ జగన్‌ బస చేస్తారు. రేపు ఉదయం 9:35 గంటలకు వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్దకు ముఖ్యమంత్రి చేరుకుంటారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద  నివాళులర్పించి.. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. తిరిగి రేపు మధ్యాహ్నం 12:45 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. 
 

Back to Top