19న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌

జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్న సీఎం

 తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ నెల 19 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప‌ర్య‌టించ‌నున్నారు. జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ నిధులు విడుదల చేయనున్నారు.

ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఎమ్మిగనూరు చేరుకుంటారు. అక్కడ వీవర్స్‌ కాలనీ వైడబ్ల్యూసీఎస్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని, జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్న సీఎం, కార్యక్రమం అనంతరం అక్కడినుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top