క్లీనింగ్ యంత్రాల‌ను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేపల్లి: క్లీనింగ్ యంత్రాలను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. స్వచ్ఛత ఉద్యమి యోజన పథకం కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ద్వారా ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు 100 మురుగు శుద్ధి వాహనాల‌ను అందజేసే కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం వద్ద లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. అంత‌కు ముందు క్లీనింగ్ మెషీన్ వాహ‌నాల ప‌నితీరును అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీలు వి. విజయసాయిరెడ్డి, నందిగం సురేష్‌, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్ వై. శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top