తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం పర్యటనకు బయల్దేరారు. వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాల సందర్భంగా తాడేపల్లిలోని తన నివాసం నుంచి విశాఖపట్నం పర్యటనకు బయల్దేరారు. మధ్యాహ్నం 3.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి 3.50 గంటలకు పీఎం పాలెం వైయస్ రాజశేఖరరెడ్డి స్టేడియానికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4.50 గంటలకు ఆరిలోవ అపోలో ఆస్పత్రికి చేరుకుని, అపోలో కేన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి 5.50 గంటలకు బీచ్ రోడ్డుకు చేరుకుంటారు. అక్కడ వీఎంఆర్డీఏ అభివృద్ది చేసిన సీ హారియర్ యుద్ద విమాన మ్యూజియంను ప్రారంభిస్తారు. అక్కడి నుంచే రామ్‌నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాను ప్రారంభించనున్నారు. అనంతరం ఎండాడలోని కాపు భవనం, భీమిలిలోని ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 6.15 గంటలకు బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో జరుగనున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.