బాబు నమ్ముకున్నది పొత్తులు.. ఎత్తులు..కుయుక్తులనే  

వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా సభలో సీఎం వైయస్‌ జగన్‌

అయిదో విడత వైయ‌స్ఆర్‌ మత్స్యకార భరోసా నిధులను విడుద‌ల చేసిన‌ సీఎం జగన్  

కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి 1,23,519 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ  

ప్రతి అడుగులోనూ మంచి చేస్తున్నాం

మన ప్రభుత్వాన్ని చూసి గత పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారు

పేదవాడికి మంచి జరుగుతుంటే చూడలేకపోతున్నారు

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు బాగుండాలనే ప్రతిక్షణం ఆలోచిస్తున్నాం

ఎన్నికలు ఉన్నప్పుడే చంద్రబాబుకు ప్రజలు గుర్తొస్తారు

నేను మంచిని నమ్ముకున్నా..ప్రజలను నమ్ముకున్నా..దేవుడిని నమ్ముకున్నా

14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తురాదు

చంద్రబాబు అంటే గుర్తకొచ్చేది వెన్నుపోటే

దత్తపుత్రుడు షూటింగ్‌లకు విరామంలో బయటకు వస్తాడు

ఇలాంటి వాళ్లు ప్రజలకు మంచి చేయగలరా?

అధికారంలో ఉంటే అమరావతి..లేకపోతే జూబ్లీహిల్స్‌

దోచుకుని హైదరాబాద్‌లో ఉండటం వీరి పని

ప్రధానులను, రాష్ట్రపతులను చేసిన పెద్ద మనిషి ఒంటరిగా బరిలోకి దిగే దమ్ముందా?

175 స్థానల్లో పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేదు

చంద్రబాబు, ఆయన పార్టీ వెంటిలేటర్‌పై ఉన్నారు

నలుగురు కలిసి లేపితే తప్ప లేవలేని పరిస్థితి టీడీపీది

దత్తపుత్రుడిని రెండుచోట్ల ఓడించారు

175 చోట్ల అభ్యర్థులను పెట్టలేని పరిస్థితిలో దత్తపుతుడు ఉన్నాడు

సీఎం పదవి వద్దు..దోపిడీలో వాటా చాలని దత్తపుత్రుడు అంటున్నాడు

రాష్ట్రాన్ని గజదొంగల ముఠాగా దోచుకోవడానికే వీరంతా కలుస్తున్నారు

ఎన్ని వ్యవస్థలను నాపై ప్రయోగించినా 15 ఏళ్లుగా ఎక్కడా రాజీ పడలేదు

మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలవండి.

న‌ర్సీప‌ట్నం:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు పొత్తులు, ఎత్తులు, కుయుక్తుల‌నే న‌మ్మ‌కున్నార‌ని, ఆయ‌న‌కు ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేసే ద‌మ్ము లేద‌ని ముఖ్య‌మంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే అమరావతి.. అధికారంపోతే జూబ్లీహిల్స్‌లో ఉంటార‌న్నారు. ఏపీలో దోచుకుని హైదరాబాద్‌లో ఉండటం వీరి పని అని విమ‌ర్శించారు. ఏపీలోనే నా శాశ్వత నివాసం ఉంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడే తాడేపల్లిలో ఇళ్లు కట్టుకొని ఉంటున్నాన‌ని గుర్తు చేశారు. ప్రధానులు, రాష్ట్రపతులను చేశానన్న పెద్ద మనిషి.. ఒంటరిగా బరిలోకి దిగే దమ్ముందా? అని స‌వాలు విసిరారు. 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేదు. ఆయనకు మైదానాల్లో సభలు పెట్టే ధైర్య కూడా లేదన్నారు. చంద్రబాబు, ఆయన పార్టీ వెంటిలేటర్‌పై ఉందని ఎద్దేవా చేశారు. అలాంటి వాళ్లు ప్రజలకు మంచి చేయగలరా అని ప్రశ్నించారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం వేదికగా అయిదో విడత వైయ‌స్ఆర్‌ మత్స్యకార భరోసా నిధులను సీఎం వైయ‌స్‌ జగన్‌ విడుదల చేశారు. కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి 1,23,519 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ చేశారు. న‌ర్సీప‌ట్నం బ‌హిరంగ స‌భ‌లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌సంగించారు. 

ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే.....:

ఈ ఆత్మీయతల మధ్య నిల్చుని చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తున్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మలకూ, ప్రతి అవ్వాతాతలకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడి హృదయపూర్వక కృతజ్ఞతలు.

మత్స్యకార భరోసా– గంగపుత్రులకు ఆసరా
ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం నిజాంపట్నం నుంచి చేస్తున్నాం. చేపల వేట నిషేధ సమయంలో సముద్రాన్నే నమ్ముకున్న మత్స్యకార అన్నదమ్ముల కుటుంబాలన్నింటికీ కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదని, వారికి అన్ని రకాలుగా తోడుగా ఉండాలని, సముద్రానికి వెళ్లే పరిస్థితి వారికి ఉండదు కాబట్టి వారి కోసం మంచి ఆలోచన చేసి వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించాం. నాలుగేళ్లు గడవక మునుపే వరుసగా ఈరోజు ఇచ్చే ఈ సొమ్ముతో ప్రతి మత్స్యకార కుటుంబానికి కేవలం మత్స్యకారభరోసా కార్యక్రమం ద్వారా రూ. 50వేలు వారి చేతిలో పెట్టాం.
ఏఫ్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు సముద్రంలోకి వెళ్లే పరిస్థితి ఉండదు, వేట నిషేధ సమయ పరిస్థితుల్లో ఎవరూ ఇబ్బంది పడకూడదని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇస్తున్నాం. ఈ రోజు అదే కార్యక్రమంలో భాగంగా 1,23,519 మంది మత్స్య కార సోదరులకు... ఒక్కొక్క కుటుంబానికి రూ.10వేల చెప్పున మొత్తం రూ.123 కోట్లు వారి అకౌంట్లలో జమ చేస్తున్నాం. 

ఇప్పటివరకూ గంగపుత్రులకు రూ. 538 కోట్ల సాయం.
ఈ రోజు జమ చేస్తున్న ఈ రూ.123 కోట్లతో కలుపుకుని ఇప్పటివరకు కేవలం ఈ ఒక్క పథకానికి రూ.538 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశాం. కడలిని నమ్ముకున్న కుటుంబాల కోసం ఇంతమంచి కార్యక్రమం దేవుడి దయతో ఈరోజు మీ బిడ్డ చేయగలుగుతున్నాడు. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడిఉంటాను.

మీ అందరితో కొన్ని విషయాలు పంచుకుంటాను. 
ఇది మీ ప్రభుత్వం. మీ బిడ్డ ప్రభుత్వం. గత ప్రభుత్వ పాలనకూ మనందరి పాలనకూ మధ్య ఉన్న తేడాలను గమనించమని కోరుతున్నాను. 
చేపల వేట నిషేధ సమయంలో గత ప్రభుత్వంలో అరకొరా సాయం చేసేవారు. అది కూడా కొద్ది మందికి మాత్రమే ఇచ్చే పరిస్థితి అయితే ఆ చేసిన సాయం కూడా వేట నిషేధ సమయంలో ఎప్పుడూ ఇవ్వలేదు. గతానికి ఇప్పటికీ తేడా మీరే చూడండి.

మత్స్యకార భరోసా నాడు– నేడు తేడా...
గతంలో కేవలం రూ.4వేలు ముష్టి వేసినట్లు ఇస్తూ... దాన్ని కూడా కొద్దిమందికే ఇవ్వడంతోపాటు ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి ఉండేది. నేడు ఎలా ఉందో గమనించండి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు చేసిన సాయం... కేవలం రూ.104 కోట్లు అదీ సగటున 60 వేల మంది మత్స్యకారులకు ఇస్తే... ఈ ఏడాది మనం 1.23 లక్షల మందికి ఇస్తున్నాం.
అప్పడిచ్చిన రూ.4వేలకు ఇప్పుడిస్తున్న రూ.10వేలకు తేడా మీరే చూడండి. అప్పుడు చంద్రబాబు హయాంలో ఐదేళ్లకు రూ.104 కోట్లు ఇస్తుంటే.. మీ బిడ్డ ప్రభుత్వంలో ఏడాదిలోనే రూ.123 కోట్ల ఇస్తున్నాం. 

గత ప్రభుత్వంలో మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ లీటరుకు రూ.6 అని చెప్పేవారు. అది కూడా కేవలం 1100 బోట్లకు మాత్రమే ప్రకటించి ఎప్పుడిస్తారో తెలియని స్ధితిలో పరిపాలన సాగించారు. 
ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో 20వేల బోట్లకు సబ్సిడీ అందిస్తున్నాం. సబ్సిడీ మొత్తాన్ని కూడా గతంలో ఇచ్చిన రూ.6 నుంచి రూ.9 కి పెంచాం. గతంలో డీజీల్‌ సబ్సిడీ ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి ఉంటే... మన ప్రభుత్వ హయాంలో మీరు ఎప్పుడు బంకుకు వెళ్లి డీజిల్‌ పోయించుకుంటే అప్పుడే మీకు రూ.9 సబ్సిడీ మినహాయించి డీజిల్‌ పోసే పరిస్థితి ఉంది.

బాబు పరిహారంలో పరిహాసం...
గతంలో చంద్రబాబు హయాంలో సముద్రంలో వేటకువెళ్లిన మత్స్యకారులు ఎవరైనా ప్రమాదవశాత్తూ చనిపోతే వాళ్లకు  పేరుకు రూ.5 లక్షలు ఇస్తామని చెప్పేవారు. అది ఎప్పుడంటే దురదృష్టవశాత్తూ సముద్రంలో గల్లంతైన ఆ మత్స్యకార సోదరుడి శవం కనిపిస్తే తప్ప పరిహారం ఇవ్వని పరిస్థితి. కానీ ఈ రోజు మన ప్రభుత్వంలో ఏ ఒక్కరికి ఎక్కడ ప్రమాదం వచ్చినా కుటుంబం తల్లడిల్లుతుందని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశ్యంతో ఆ కుటుంబాలకు తోడుగా ఉండేందుకు పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడమే కాకుండా.. దుర్ఘటన జరిగిన వారం రోజులలోపు రూ.5 లక్షలు ఇచ్చేటట్టుగా, ఆరు నెలలు తిరక్క మునుపే మరో రూ.5 లక్షలు కలిసి రూ.10 లక్షలు ఇస్తుంది. ఇలా ప్రతి మత్స్యకార కుటుంబాన్ని ఆదుకుంటూ.. ఇప్పటివరకు ఈ ఒక్క దానికే రూ.13.50 కోట్లు ఖర్చు పెట్టాం. 

సానుభూతి చూపని చంద్రబాబు...
ఏ మత్స్యకార కుటుంబం ఇబ్బంది పడకూడదు, వారికి ఏ ఇబ్బంది వచ్చినా తోడుగా ఉండాలన్న తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం. గతంలో ముమ్మడివరం నియోజకవర్గంలో అప్పట్లో జీఎస్‌పీసీ వాళ్లు 2012లో డ్రిల్లింగ్‌ చేయడం వల్ల జీవనోపాధి కోల్పోయిన 16,500 మత్స్యకార కుటుంబాలకు ఒక్కోక్క కుటుంబానికి 7 నెలల కాలానికి రూ.47,250 చొప్పున మొత్తంగా రూ.78 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది.  2012లో మత్స్యకారులకు ఈ డబ్బులు ఇవ్వాల్సి ఉంటే... 2014లో ముఖ్యమంత్రి అయిన ఈ పెద్దమనిషి చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో దాన్ని ఇప్పించాలని కానీ, అలా ఇప్పించలేని పక్షంలో మనమే ఇచ్చి తర్వాత వాళ్ల దగ్గర నుంచి రీయింబర్స్‌ చేసుకోవాలని కనీసం సాగుభూతితో అడుగులు వేసిన పరిస్థితి లేదు. కానీ మీ బిడ్డ దానికి భిన్నంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మత్స్యకార కుటుంబాలకు ముందుగా మనం డబ్బులు ఇచ్చి, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకున్నాం. ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్‌ కోసం పైపులైన్‌ నిర్మాణం వల్ల ఉపాధి కోల్పోయిన మరో 23,458 మంది మత్స్య కార కుటుంబాలుకు ఇదే మాదిరిగా రూ.216 కోట్ల పరిహారం కూడా మన ప్రభుత్వంలోనే ఇప్పించాం. వాళ్లకు మళ్లీ మలివిడతగా పరిహారంగా కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 23,458 మత్స్యకార కుటుంబాలకు మూడో విడతగా రూ.46వేల చొప్పున వాళ్లకూ ఈ కార్యక్రమంలో భాగంగా రూ.108 కోట్లు బటన్‌ నొక్కి డబ్బులు జమ చేస్తున్నాం.

ఏపీ రెండో పేద్ద తీర ప్రాంతం – అభివృద్ధి దిశగా...
మనకు దేశంలోనే రెండో అతిపెద్ద సముద్ర తీరం ఉంది. అయినా కూడా మన మత్స్యకారులు ఎలా బ్రతుకుతున్నారు. వాళ్లకు ఏం కావాలి ? వారి జీవన ప్రమాణాలు ఎలా పెంచాలి? వారు ఉపాధి వెతుక్కూంటూ ఎక్కడో గుజరాత్‌కో, తమిళనాడుకో, ఒడిషాకో ఎందుకు పోవాల్సివస్తుంది ? వాళ్ల పరిస్థితులు ఎలా మార్చాలి ? మన దగ్గర తక్కువైంది ఏంటి ? అన్న ఆలోచనలు ఎప్పుడూ గతంలో జరగలేదు. 

రూ.400 కోట్లతో నిజాంపట్నం ఫిషింగ్‌ హార్భర్‌....
పక్కనే నిజాంపట్నం ఫిషింగ్‌ హార్భర్‌ రూ.400 కోట్లతో పనులు వాయువేగంతో జరుగుతున్నాయి. ఎక్కడెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా, మన బోట్లతో మనం ఇక్కడే వ్యాపారం చేసుకునే పరిస్థితుల్లోకి ఆలోచనలు ఎప్పుడూ జరగలేదు. ఇవాళ అటువంటి వాటిపై ఏం చేస్తే ఈ పరిస్తితులు మారుతాయని మనసు పెట్టి ఆలోచన చేశాం.  

రూ. 16 వేల కోట్లతో పోర్టులు, ఫిషింగ్‌ హార్భర్లు, షిప్‌ ల్యాండింగ్‌ సెంటర్లు.
సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులకు అందరికీ మంచి జరగాలని, ఈ సమస్యలన్నింటికీ కూడా శాశ్వత పరిష్కారం చూపాలని ఈ రోజు రాష్ట్రంలోఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా ఇవాళ ప్రపంచస్ధాయితో 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్‌ హార్భర్లు, 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు నిర్మిస్తున్నాం. వీటి కోసం రూ.16వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం.
ఇందులో కేవలం 10 పిషింగ్‌ హార్భర్లకు, 6 పిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లకు మాత్రమే చూసుకుంటే.. రూ.3800 కోట్లు ఖర్చు చేసి మత్స్యకార కుటుంబాలకు మంచి జరగాలని తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం.

ఆక్వా రైతులకు సైతం ఆండగా...
ఆక్వా రైతులకు సైతం మంచి జరగాలని, ఆక్వా రైతులకు కరెంటు యూనిట్‌ రూ.1.50కే సరఫరా చేస్తూ దీనికోసం రూ.2,792 కోట్లు సబ్సిడీగా ఇచ్చాం. ఎన్నికలు వచ్చేటప్పుడు చంద్రబాబు గారి హయాంలో మోసం చేసేందుకు ఎన్నికలకు మూడు నెలల ముందు తాను సబ్సిడీ రూ.2 అని ప్రకటించాడు. కానీ ఆ పెద్ద మనిషి ప్రకటించిన సబ్సిడీ ఇవ్వలేదు. బకాయిలు పెట్టాడు. ఆయన బకాయిలు పెట్టిన ఆ రూ.300 కోట్లు కూడా మన ప్రభుత్వమే చెల్లించింది. 

నైపుణ్యం కోసం – ఫిషరీస్‌ యూనివర్సిటీ...
మన మత్స్యకారులందరూ ఇక్కడే ఫిషింగ్‌ హార్భర్లు వస్తున్నాయి. ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు వస్తున్నాయి. ఉన్న 6 పోర్టులకు అదనంగా మరో 4 పోర్టులు కొత్తగా వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మన వాళ్లకు చదువులు నేర్పాలి. మన మత్స్యకారుల నైపుణ్యాలు పెరగాలి. అలా వారి నైపుణ్యాలు పెరిగితే మన మత్స్యకార కుటుంబాలకు మెరుగైన జీతాలతో ఈ పోర్టులు, ఫిషింగ్‌ హార్భర్లలో ఉపాధి లభించడమే కాకుండా, వాళ్ల స్వయం ఉపాధితో బోటులు కొనుగోలు చేసి అడుగులు ముందుకు వేయగలుగుతారని.. వీళ్లందరికీ శాశ్వతంగా మంచి జరగాలని ఫిషరీస్‌ యూనివర్సిటీ నిర్మాణం ప్రారంభించాం.

మత్స్యకారులకు జీవన ప్రమాణాలను పెంచేందుకు, వారి ఆర్ధిక, సామాజిక అభివృద్ధికి దోహద పడేలా మొత్తంగా రాష్ట్రంలోఆక్వా, మత్స్య రంగాలకు మంచి జరిగేలా, మత్స్యరంగంలో కూడా నిపుణులను తయారుచేసే విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిషరీస్‌ యూనివర్సిటీని నెలకొల్పుతున్నాం.

ఆక్వా పార్కుకూ శంకుస్ధాపన...
ఆక్వా కల్చర్‌ అభివృద్ధిలో భాగంగా ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో దిండి గ్రామం, వలసవారి పాలెంలో 280 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి రూ.185 కోట్లు ఖర్చుచేస్తూ.. ఆక్వాపార్కు నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తున్నాం. దీనివల్ల ఆక్వా రైతులకు నాణ్యమైన ఫీడ్, సీడ్‌ అందించడం జరుగుతుంది. ఆక్వారైతుల సామర్ధ్యం పెంచడం ద్వారా రొయ్యలు, సముద్ర చేపలు, పీతల సీడ్‌ ఇక్కడే తయారు చేస్తారు. మడ్‌ క్రాబ్,  సీ బాస్‌కి సంబంధించిన సీడ్‌ ప్రొడక్షన్‌ కావాలంటే ఏకంగా పాండిచ్చేరి వెళ్లాల్సిన పరిస్థితి నుంచి నిజాంపట్నంలో అందుబాటులో ఉండే పరిస్థితి వస్తుంది. దీనివల్ల 11,388 ఆక్వా రైతులకు ప్రత్యక్షంగా మంచి జరగడమే కాకుండా మరో 21వేల మంది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి కలుగుతుంది. 

ఈ ఆక్వాపార్కు అభివృద్ది చెందడం వల్ల మొత్తమ్మీద 10వేల ఎకరాలు ఆక్వాసాగులోకివస్తాయి. మరోవైపు ఓడరేవు ఇక్కడ నుంచి 30–40 కిలోమీటర్లు దూరంలో ఉంది. రూ.417 కోట్లతో ఓడరేవులో  ఫిషింగ్‌ హార్భర్‌కు కూడా శంకుస్ధాపన చేశాం. ఇవన్నీ మత్స్యకార సోదరుల మేలుకోసం వారికి మంచి జరగాలని మనసా, వాచా, కర్మేణా ఆలోచన చేసి అడుగులు ముందుకు వేస్తున్నాం.

మంచిని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు...
ప్రతిసామాజిక వర్గంలోనూ, ప్రతి పేదవాడిని  నా ఎస్సీ, ఎస్టీ, నా బీసీ, నా మైనార్డీ అని చెప్పి మీ బిడ్డ ప్రస్తావిస్తున్నాడు. మీరు నా వారు అని చెప్పి ప్రతి అడుగులోనూ ప్రేమ చూపిస్తున్నాడు. ఇంత మంచి చేస్తున్నాం కాబట్టి.. ఈ ప్రభుత్వం మీది, మనందరిది కాబట్టి గతంలో పాలన చేసినవాళ్లు, ఆ పాలనకు మద్దతిచ్చినవాళ్లు  కొందరు తట్టుకోలేకపోతున్నారు. జీర్ణించుకోలేకపోతున్నారు. పేదవాడికి మంచి జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇంతగా మీ మంచి కోసం మీ బిడ్డ ఆలోచన చేసే మనందరి ప్రభుత్వానికి, వాళ్లకి తేడా గమనించండి. ప్రతి క్షణం నా ఎస్సీలు, నా బీసీలు బాగుండాలని, నా మైనార్టీలు బాగుండాలని మీ బిడ్డ ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే.. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే బాబుగారికి పేదవాడు గుర్తుకొస్తాడు. ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబు గారి నోట మత్స్యకారులైనా, బీసీలు, ఎస్సీలైనా, ఎస్టీలైనా, మైనార్టీలైనా గుర్తుకొస్తారు. తేడా గమనించండి.

వారికి నాకూ మధ్య తేడా..
నేను చేసిన మంచిని నమ్ముకుంటాను. నేను మిమ్నల్ని నమ్ముకున్నాను. నేను దేవుడిని నమ్ముకున్నాను. మరోవంక ఏ మంచీ చేయని చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు వీరిద్దరూ  పొత్తులని, ఎత్తులని, చిత్తులని, కుయుక్తులనీ నమ్ముకున్నారు. 
14 ఏళ్లుగా సీఎంగా ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారి  పేరు చెబితే ఒక్క స్కీం అంటే ఒక్క స్కీం కూడా గుర్తుకు రాదు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పేరు చెబితే ఒక్క మంచి చేశాడని ఎవరికీ గుర్తుకురాదు. కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే మనందరికీ గుర్తుకు వచ్చేది ఒక్కటే.. అది వెన్నుపోటు.బాబు పేరు చెబితే వెన్నుపోటు గుర్తుకు వస్తుంది, మోసం గుర్తుకువస్తుంది. కుతంత్రాలు గుర్తుకు వస్తాయి. పేదలకు ఏ మంచీ చేయని ఈ వ్యక్తికి ఎవరైనా కూడా ఎందుకు మద్ధతిస్తారు ? 

దత్తపుత్రుడు – షూటింగ్‌ గ్యాప్‌లో పొలిటికల్‌ మీటింగ్‌.
మరోవంక ఆయన దత్తపుత్రుడు కనిపిస్తాడు. 
రెండు సినిమాలకు మధ్య షూటింగ్‌ విరామానికి మధ్యలో అప్పుడప్పుడూ పొలిటికల్‌ మీటింగ్‌లు పెట్టడానికి వస్తుంటాడు. ఆ పొలిటికల్‌ మీటింగ్‌లు పెట్టేటప్పుడు కూడా బాబు కాల్‌షీట్స్‌ ప్రకారం, బాబు ఏదైతే చెప్తాడో ఆ స్క్రిప్ట్‌ ప్రకారం ఈ ప్యాకేజీల స్టార్‌ వచ్చి మాట్లాడి పోతుంటాడు. నాలుగు రాళ్లు మీ బిడ్డ మీద వేసి పోతుంటాడు.  ఇటువంటి వాళ్లకు ప్రజాజీవితం అంటే తెలుసా ? ఇటువంటి వాళ్లు ప్రజలకు మంచి చేయగలరా ? ఆలోచన చేయండి.  
వీళ్లద్దరూ కూడా ఎలాంటి వాళ్లంటే.... అధికారంలో ఉంటే అమరావతి, అధికారం పోతే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌... ఇదే వీళ్ల శాశ్వత  నివాసం. మన రాష్ట్రం మీద కానీ, మన పేదలమీద కానీ, మన ప్రజల మీద కానీ ప్రేమ వీళ్లెవరికీ లేదు. కనీసం ఇక్కడ ఉండాలన్న ఆలోచన కూడా వీరికి తట్టదు.

మీ బిడ్డ ప్రతిపక్షనేతగా ఉండగా తాడేపల్లిలో ఇళ్లు కట్టుకుని అక్కడే నివాసముంటున్నాడు. కానీ విచిత్రమేమిటంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు సీఎంగా ఉండగా.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తన ప్యాలెస్‌ కట్టుకున్నాడు. తేడా గమనించండి. ఒక దత్తపుత్రుడు, ఒక దత్త తండ్రి.

దోచుకుని, దాచుకోవడం వీరి సిద్ధాంతం...
వీరి పార్టీలు, వీరి సిద్ధాంతం ఒక్కటే. మన రాష్ట్రంలో దోచుకోవడం. దోచుకున్నది పంచుకుని హైదరాబాద్‌లో నివాసం ఉండడం. చంద్రబాబు నాయుడు నోట్లోంచి అప్పుడప్పుడూ మాటలు వస్తుంటాయి. ప్రధానుల్ని, రాష్ట్ర పతుల్ని తానే చేసానంటూ ఈ పెద్దమనిషి చంద్రబాబు కోతలు కోస్తుంటాడు. ప్రధానుల్ని, రాష్ట్ర పతుల్ని తానే చేసానంటూ కోతలు కోసే ఈ బాబుకు మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు 175 నియోజవర్గాల్లో ఒంటరిగా బరిలోకి దిగే సత్తా కూడా లేదు.
కనీసం రాష్ట్రంలో ఉన్న 175 స్ధానాల్లో తాను పోటీ చేస్తే తన పార్టీకి రెండో స్ధానం వస్తుందా ?లేదా ? పరువు దక్కించుకోగలుగుతాడా ?లేదా ? అన్న నమ్మకం కూడా ఆయనకు లేదు. 

175 నియోజకవర్గాల్లో పోటీ చేయలేని బాబు...
రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కనీసం తన తరపున పోటీకి కూడా పెట్టే సామర్ధ్యం లేని వాళ్లు 14 సంవత్సరాలుగా సీఎంగా పరిపాలన చేసామని చెప్పుకుంటారు. 
మైదానాలలో బహిరంగ సభలు పెట్టే ధైర్యం కూడా వీళ్లెవరికీ లేదు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు మైదానాలలో మీటింగ్‌లు పెడితే కుర్చీలు ఖాళగా ఉంటాయని చెప్పి, చిన్న చిన్న సందులు, గొందుల్లో మీటింగ్‌లు పెడుతున్నారు. అలాంటి సందులు, గొందుల్లో మీటింగ్‌లో పెడితే మనుషులు చనిపోతున్నా కనీసం వాళ్ల పట్ల సానుభూతి కూడా చూపని వ్యక్తులు వీళ్లు.
ఈ రోజున ఇదే చంద్రబాబు నాయుడుగారు ఆయన పార్టీ వెంటిలేటర్‌ మీద ఉన్నారు. నలుగురు కలసి లేపితో తప్ప లేవలేని పరిస్థితుల్లో ఉంది ఆ పార్టీ.

ప్రజలు ఎమ్మెల్యేగా మాకొద్దన్న వ్యక్తి దత్తపుత్రుడు....
మరోవంక దత్తపుత్రుడు కనిపిస్తాడు.
ఈ పెద్ద మనిషి  ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీ చేస్తే... అయ్యా మీరు మాకు ఎమ్మెల్యేగా కూడా వద్దు అని ప్రజలు నమస్కారం పెట్టి  ఓడించారు.  ఇదే దత్తపుత్రుడు తన రాజకీయ పార్టీ పెట్టి పది సంవత్సరాలు అయింది. ఈ దత్తపుత్రుడు పెట్టిన రాజకీయ పార్టీ కనీసం 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధిని కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉంది. 
ఒక్కో ఎన్నికకు ఒక్కో రేటు. పార్టీని హోల్‌సేల్‌గా అమ్ముకునే ఈ ప్యాకేజీ స్టార్‌ ఈ మధ్యకాలంలో అన్న మాటలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది.
ఈ పెద్దమనిషి నేను ముఖ్యమంత్రి అయినా, కాకపోయినా ఫర్వాలేదు. దోపిడీలో నాకు రావాల్సినవాటా వస్తే చాలు అంటున్నాడు. ఆలోచన చేయండి. వీళ్లంతా ఎందుకు కలుస్తున్నారో ఆలోచన చేయండి?
ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5 వీళ్లంతా ఎందుకు కలుస్తున్నారు ? రాష్ట్రాన్ని ఒక గజదొంగల ముఠాగా దోచుకోవడానికే కలుస్తున్నారు. 
దోచుకున్నది పంచుకోవడం కోసం వీళ్లంగా కలుస్తున్నారు.

ఎన్ని కష్టాలు వచ్చినా మీ తరపునే నిలబడ్డా...
కానీ మరో వంక మీ బిడ్డ ఉన్నాడు. మీ జగన్‌ ఎన్ని కష్టాలు వచ్చినా ?  ఎన్ని అవమానాలు ఎదురైనా ? ఎన్ని వ్యవస్ధలు నా మీద కత్తి కట్టినా  ? ఎన్ని వ్యవస్ధలు నా మీద ప్రయోగించినా ? ఈ 15 ఏళ్లుగా ఎక్కడా కూడా మీ బిడ్డ మీ తరపునే నిలబడ్డాడే తప్ప ఎక్కడా రాజీపడలేదు.

మీ బిడ్డకు ధైర్యం మీరే. 
మీ బిడ్డ నమ్ముకున్నది కూడా మిమ్మల్ని, దేవుడి దయను మాత్రమే. మనందరి ప్రభుత్వం చేసిన మంచిని మాత్రమే నమ్ముకుంది. చేసిన మంచిని మాత్రమే చెబుతుంది. మంచి జరిగిందా ?లేదా అది ఒక్కడే చూడమని అడుగుతుంది. మీ ఇంట్లో మీకు మంచి జరిగితే మాత్రం మీ బిడ్డకు తోడుగా మీరు సైనికుల్లా నిలబడండి అని కోరుతున్నాను.

ఈ రోజు చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్ధను గమనించండి. నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని, రాష్ట్రపతిని కలిస్తే.. కలిసిన ప్రతిసారీ మీ బిడ్డ మీద బురద జల్లుతారు. దుష్ప్రచారం చేస్తారు. కానీ నిజజీవితంలో వీళ్లేం చేస్తున్నారు గమనిస్తే.. .వీరే బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు.వీరే కాంగ్రెస్‌తో కూడా అంటకాగారు. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీఎస్పీ ఇలా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంది వీరే. మరలా వదిలేసింది వీళ్లే. వివాహం చేసుకునేది వీళ్లే. విడాకులు ఇచ్చేది వీళ్లే. మరలా విడాకులు ఇచ్చి వివాహం చేసుకునేది వీళ్లీ.. మళ్లీ మళ్లీ విడాకులు ఇచ్చేదీ వీళ్లే. ఇటువంటి విలువలు లేని, విశ్వసనీయత లేని రాజకీయాలు, రాజకీయ నాయకులు మన రాష్ట్రంలో కనిపిస్తున్నారు. 

దత్త తండ్రి- దత్త పుత్రుడి మ్యాచ్‌ ఫిక్సింగ్‌. 
దత్త తండ్రికి, దత్త పుత్రుడికి మధ్యలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఏ లెవెల్లో ఉందంటే... ఇదే పెద్దమనిషి చంద్రబాబు దత్తపుత్రుడిని చూసి మన ఇద్దరం కలిసి వెళ్దామంటే, దత్తపుత్రుడు చిత్తం ప్రభూ అని చంద్రబాబు నాయుడు గారికి దాసోహం అంటాడు. ఇదే చంద్రబాబు మనిద్దరం విడివిడిగా వెళ్దాం, విడివిడిగా వెళ్తే మంచి జరుగుతుందని చెబితే.. దత్తపుత్రుడు అలాగే సార్, మీకు ఏది మంచి జరుగుతుందంటే... అలానే చేస్తానంటాడు. 

ఇదే చంద్రబాబు..  దత్తపుత్రుడితో నువ్వు పోటీ చేయకు అంటే... దత్తపుత్రుడు జీ హుజూర్‌ నేను పోటీ చేయను అంటాడు. ఇదే చంద్రబాబు దత్తపుత్రుడితో నువ్వు ప్రస్తుతానికి కమ్యూనిస్టులతో కలువు అంటే.. సార్‌ తప్పకుండా కలుస్తానంటాడు.

ఇదే చంద్రబాబు... మనం విడివిడిగా పోటీ చేస్తున్నట్టు కనిపిస్తాం... దానివల్ల నాకు మంచి జరుగుతుంది.. కానీ లోపాయికారిగా సంబంధాలు పెట్టకుందాం. నేను గాజువాకకు రాను, భీమవరానికి రాను, నిన్ను ఇబ్బంది పెట్టను. నువ్వు కూడా మంగళగిరిలో పోటీపెట్టొద్దంటే.. దత్తపుత్రుడు తప్పకుండా అలాగే చేస్తాను సర్‌ అంటాడు. 
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు మరలా వాళ్లేం చేస్తారోనని బీజేపీకి భయపడి వారికి దగ్గర కావడం కోసం.. ఇప్పుడు బీజేపీ పక్కన నువ్వు ఉండు దత్తపుత్రా అని చెబితే.. చిత్తం ప్రభూ అని చెప్పి బీజేపీ పక్కకు చేరుతాడు. ఆ రోజు మీరే చూస్తుండండి.. .. మీ ఆందరికీ నేను చెప్తున్నాను... చంద్రబాబునాయుడు గారు విడాకులు ఇచ్చెయ్‌ అంటే దత్తపుత్రుడు మరలా ఇదే బీజేపీకి విడాకులు ఇచ్చేసి, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను సర్‌ అంటాడు. 
ఇలాంటి రాజకీయాలు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నాయి. దత్తబాబు ఇచ్చే ప్యాకేజీల కోసం ఎలాంటి వేషాలైనా వేయడానికి సిద్ధపడే ఇలాంటి దత్తపుత్రుడు.. వీళ్లద్దరూ ఇలా రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉందా ? ఇలాంటి ఆన్యాయమైన రాజకీయాలకు తానా, తందాన అంటారు గజదొంగల ముఠాలోని మిగిలిన సభ్యులు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్లందరూ గజదొంగల ముఠాలోని సభ్యులు. దత్తతండ్రి, దత్తపుత్రుడు బ్రహ్మాండంగా వ్యూహాలు వేస్తున్నారు అని  వీళ్లంతా పెద్ద పెద్ద అక్షరాలతో వాళ్ల పేపర్లలో రాస్తారు. టీవీ కార్యక్రమాల్లో చర్చలు పెడతారు. చక్రం తిప్పుతున్నారని చెప్పి నాలుగు మాటలు మాట్లాడుతారు. 

విపక్షాలది అధికారం కోసం ఆరాటం...
ఆశ్చర్యమేమిటంటే...ఆక్కడెక్కడో కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిస్తే... బీజేపీ ఓడితే. ఇది చంద్రబాబు విజయం అన్నట్టుగా వీళ్లంతా ఇక్కడ పండగ చేసుకుంటారు. మరోవంక అక్కడ ఓడిన బీజేపీని ఇక్కడ తమతో కలిసి రావాలని అడుగుతారు. నిజంగా ఇంత సిగ్గులేని అన్యాయమైన రాజకీయాలు మనమంతా చూస్తున్నాం. వీరిది జగన్‌తో కాదు యుద్ధం. వీరిది జనంతో యుద్ధం. ఈ రోజు రాష్ట్రంలో పెత్తందార్లు ఒకవైపు ఉంటే... మరోవైపు పేదవాడు ఉన్నాడు. వీరిది రాజకీయ పోరాటం కాదు. అధికారం కోసం ఆరాటం. వీరి ఆలోచనలన్నీ కూడా రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి ? దోచుకున్నది ఎలా పంచుకోవాలి? పంచుకున్నది ఎలా దాచిపెట్టుకోవాలన్న దిక్కు మాలిన ఆలోచనలే వీళ్లవి. పేదలకు మంచి చేయాలన్న తపన, తాపత్రయం వీళ్లకు లేదు. 

మీ బిడ్డ పరిపాలనలో 
లంచాలకు, వివక్షకు తావులేకుండా.. ఎన్నికలప్పుడు మీ బిడ్డకు ఓటు వేయకపోయినా అర్హత ఉంటే చాలు కచ్చితంగా  వాళ్లకు మంచి జరగాలని తపన, తాపత్రయంతో మీ బిడ్డ అడుగులు వేస్తున్నాడు. ఏకంగా రూ.2.10 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో లంచాలకు తావు లేకుండా, వివక్షకు చోటు లేకుండా జమ చేశాడు. ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్ధానాలను, మేనిఫెస్టోలో చెప్పిన వాగ్ధానాలను 98 శాతం అమలు చేసి... మీ బిడ్డ మాటనిలబెట్టుకున్నాడు.

ప్రతి ఇంటింటికీ వెళ్లి..
ఈ రోజు మీ బిడ్డ తరపున ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు వచ్చి ప్రతి అక్క,చెల్లెమ్మ దగ్గరకు వెళ్లి.. అక్కా మీ ఇంట్లో జరిగిన మంచి ఇది. ఈ మంచి అంతా మీకు జరిగిందా అని అడుగుతున్నారు. ఈ మంచి మీ ఇంట్లో జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా ఉండండి. మీ ఆశీస్సులు మాకు ఇవ్వండి అని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు అందరూ వచ్చి ధైర్యంగా మీ ఇంటికి వచ్చి అడుగుతున్న పరిస్థితి మీ బిడ్డ పాలనలో ఉంది. గత పాలనకు మన పాలనకు తేడా గమనించండి.

గతంలో డబ్బులతో ఎవరి జేబులు నిండాయి...
అదే రాష్ట్రం అదే బడ్జెట్‌. అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ చేశాం. మరి మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి ఎందుకు జరుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వంలో ఎందుకు మంచి చేయలేకపోయాడు ? ఆ డబ్బులన్నీ ఎవరి జేబులోకి పోయాయి ? ఆలోచన చేయాలి. మీ బిడ్డ హయాంలో రూ.2.10 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వచ్చింది. నాలుగేళ్లలో ఇది మీ బిడ్డ చేయగలిగితే... మరో ఇదే రూ.2.10 లక్షల కోట్లు బాబు హయాంలో ఎవరి జేబుల్లోకి ఎంతెంత పోయింది అన్న సంగతి ఆలోచన చేయండి.

మీ అందరికీ మంచి జరగాలన్న తపన, తాపత్రయంలో మీ బిడ్డ అడుగులు వేస్తున్నాడు. ఈ రోజు జరిగిన మంచి కార్యక్రమంతో మీ జీవితాల్లో ఇంకా వెలుగులు నిండాలని, మీ మొహంలో ఇంకా చిరునవ్వులు చూడాలని, ఆ మంచి చేసే అవకాశం దేవుడు మీ బిడ్డకు ఇవ్వాలని ఆశిస్తున్నాను.

కాసేపటి క్రితం 
ఎంపీ రమణ మాట్లాడుతూ.. నియోజకవర్గానికి సంబంధించి కొన్ని పనులు అడిగారు. నిజాంపట్నంలో సింగిల్‌ లైన్‌ రోడ్డు బ్రిడ్జికి రూ.2.50 కోట్లు అడిగారు. అది మంజూరు చేస్తున్నాను. నిజాంపట్నం మండలం కొత్తూరులో బాలికల గురుకుల పాఠశాల కావాలన్నారు.  రూ.10 కోట్లతోఅదీ మంజూరు చేస్తున్నాం. రూ.25 కోట్లతో, సీసీరోడ్డు, వాల్, డ్రైయిన్‌ల కోసం నిజాంపట్నం రేవు లంకవారిరేవు దగ్గర కావాలన్నారు. దాన్ని కూడా మంజూరు చేస్తున్నాం. దాదాపు 13 పనులు అడిగారు. ఇవన్నీ మంజూరు చేస్తాను. మీ అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానని అని సీఎం ప్రసంగం ముగించారు.

Back to Top