విద్యార్థి రంజిత్‌ మృతిపై సీఎం దిగ్భ్రాంతి

బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థికసాయం ప్రకటించిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: పాముకాటుతో విద్యార్థి రంజిత్‌ మృతిపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన విద్యార్థి కుటుంబానికి రూ.5లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించారు. విజయనగరం జిల్లా కురుపాం గురుకుల హాస్టల్‌లో పాముకాటుతో విద్యార్థి మృతిచెందాడు. మంత్రులు పుష్పశ్రీవాణి, వేణుగోపాలకృష్ణ  ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం వైయస్‌ జగన్‌కు వివరించారు. విద్యార్థి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం.. బాధిత కుటుంబానికి రూ.5లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. కలెక్టర్‌ సూర్యకుమారి విద్యార్థి కుటుంబానికి ఆర్థికసాయం అందజేయనున్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top