బస్సు ప్రమాదంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2     లక్షలు

స్వల్పంగా గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున సహాయం

తాడేప‌ల్లి: అన్నమయ్య జిల్లా పుల్లంపేట వద్ద ఆర్టీసీ బస్సుకు జరిగిన ప్రమాదంలో పలువురు మృతిచెందిన ఘటనపై సీఎం వైయస్.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలవాలన్నారు. మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేసియా ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున సహాయం చేయాలన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

Back to Top