విశాఖ ట్రాఫిక్ ఆంక్ష‌ల‌పై సీఎం సీరియ‌స్‌

ప్ర‌జ‌ల‌ను ఎందుకు ఇబ్బందుల‌కు గురిచేశారు..?

వెంట‌నే విచార‌ణ చేప‌ట్టాల‌ని డీజీపీకి సీఎం ఆదేశం

తాడేప‌ల్లి: విశాఖ‌ శ్రీ శారదా పీఠం సందర్శనలో భాగంగా ట్రాఫిక్ ఆంక్ష‌ల‌పై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం విశాఖ పర్యటన సందర్భంగా.. నగరంలో గంటల తరబడి అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీనిపై సీఎం వైయ‌స్‌ జగన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖ ట్రాఫిక్ జామ్‌పై వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. గంటల తరబడి ట్రాఫిక్ ఎందుకు నిలిపేశారని అధికారులను ముఖ్య‌మంత్రి ప్రశ్నించారు. ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురిచేశారని అధికారులపై సీరియస్‌ అయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని సీఎం వైయ‌స్ జగన్‌ ఆదేశించారు.

Back to Top