తాడేపల్లి: స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డుపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమీక్షా సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఉన్నతాధికారులు హాజరయ్యారు.