తాడేపల్లి: యుద్ధ ప్రాతిపదికన వైయస్ఆర్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది జూన్ నాటికి తొలి దశ డిజిటల్ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. వైయస్సార్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణ పనుల పురోగతిపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతి డిజిటల్ లైబ్రరీలో డెస్క్‌టాప్, యూపీఎస్, ఇంటర్నెట్ కనెక్షన్‌తో పాటు డెస్క్‌టాప్ టేబుల్స్, సిస్టం చెయిర్స్, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, ఐరన్ ర్యాక్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. డిజిటల్ లైబ్రరీల పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అధికారులు వివరించారు. ఫేజ్–1 లో మిగిలిపోయిన డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలను ఫేజ్ 2లో కవర్ అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేసినట్లవుతుందని, ఇంకా మొదలు కాని చోట్ల పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పారు. కంప్యూటర్లు, ఇంటర్నెట్ కనెక్షన్, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సంబంధించిన పనులపై మరింత ధ్యాస పెట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంతోనే వర్క్ ఫ్రం హోం సులువవుతుందని పేర్కొన్నారు. ఫేజ్ –1లో 4,530 గ్రామాల్లో ఏర్పాటవుతున్న డిజిటల్ లైబ్రరీలకు అవసరమైన నెట్ కనెక్టివిటీ ఫిబ్రవరి 2022 నాటికి పూర్తవుతుందని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే...: ఈ యేడాది జూన్ నాటికల్లా తొలిదశ డిజిటల్ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా చూడాలి : అధికారులకు సీఎం ఆదేశం డిజిటల్ లైబ్రరీల నిర్మాణంతో వర్క్‌ఫ్రం హోం సాధ్యమవుతుంది ప్రతి డిజిటల్ లైబ్రరీలో డెస్క్‌టాప్, యూపీఎస్, ఇంటర్నెట్ కనెక్షన్‌తో పాటు డెస్క్‌టాప్ టేబుల్స్, సిస్టం ఛెయిర్స్, ఫ్యాన్స్, ట్యూబ్ లైట్లు, ఐరన్ రాక్స్ ఏర్పాటు ఫేజ్ 1 లో మిగిలిపోయిన డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలను ఫేజ్ 2లో కవర్ అయ్యేలా చూడండి: అధికారులకు సీఎం ఆదేశం తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేసినట్లవుతుందన్న సీఎం డిజిటల్ లైబ్రరీల పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్న అధికారులు యుద్ధ ప్రాతిపదికిన డిజిటల్ లైబ్రరీలు పూర్తి చేయాలి : అధికారులకు సీఎం ఆదేశం ఇంకా మొదలుకాని చోట్ల పనులు వెంటనే ప్రారంభించాలి : డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై మరింత ధ్యాస పెట్టి పూర్తి చేయాలన్న సీఎం కంప్యూటర్లు, ఇంటర్నెట్ కనెక్షన్, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సంబంధించిన పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలి : అధికారులకు సీఎం ఆదేశం. ఈ సమీక్షా సమావేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్యుత్‌శాఖమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, విద్యుత్‌శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీజెన్‌కో ఎండీ బి శ్రీధర్, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఏపీటీఎస్ ఎండీ ఎం నందకిషోర్, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ఎండీ ఎం మధుసూధన్ రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ డైరెక్టర్ ఎస్ ఎస్ మోహన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.