భారీ వర్షాలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

అమరావతి: రాయలసీమలో కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు.భారీ వర్షాల కారణంగా కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.వచ్చే ఏడాది నాటికి రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నింపేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ఇసుక కొరతపై సీఎం సమీక్ష
రాష్ట్రంలో ఇసుక కొరతపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వరదల కారణంగా ఇసుక అందుబాటులోకి రాలేదని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.గోదావరి, కృష్ణా నదుల్లో ఇంకా వరద ప్రవాహం ఉందని అధికారులు తెలిపారు. వరద తగ్గిన వెంటనే ఇసుక రీచ్‌లు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు.వరదలు తగ్గిన తర్వాత వీలైనంత ఇసుకను స్టాక్‌ యార్డుల్లోకి తరలించడానికి ముమ్మర ప్రయత్నాలు చేయాలని సీఎం ఆదేశించారు. 
 

Back to Top