తాడేపల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా కూడా సిబ్బంది లేరనే మాట రాకూడదని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. అవసరమైన మేరకు ఉండాల్సిన డాక్టర్లు, నర్సులు.. ఇతరత్రా సిబ్బంది ఎక్కడ ఖాళీగా ఉన్న గుర్తించి వెంటనే భర్తీచేయాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న రిక్రూట్‌మెంట్ బోర్డు వెంటనే వాటికి సంబంధించిన ఖాళీలను భర్తీచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సరిపడా సిబ్బంది ఉంటే సగం సమస్యలు సమసిపోతాయని చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే... ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా కూడా సిబ్బంది లేరనే మాట రాకూడదు : సీఎం క్రమం తప్పకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆడిట్ చేయాలి. ప్రతి ఆస్పత్రినీ ఒక యూనిట్‌గా తీసుకుని ఆడిట్ చేయాలి. విలేజ్ క్లినిక్ నుంచి బోధనాసుపత్రి వరకూ ఈ ఆడిట్ నిర్వహించాలి. అవసరమైన మేరకు ఉండాల్సిన డాక్టర్లు, నర్సులు.. ఇతరత్రా సిబ్బంది ఎక్కడ ఖాళీగా ఉన్న గుర్తించి వెంటనే భర్తీచేయాలి. వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న రిక్రూట్‌మెంట్ బోర్డు వెంటనే వాటికి సంబంధించిన ఖాళీలను భర్తీచేసేలా చర్యలు తీసుకోవాలి. సరిపడా సిబ్బంది ఉంటే సగం సమస్యలు సమసిపోతాయి. దీంతోపాటు మౌలిక సదుపాయాలు, మందులు కూడా సరిపడా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల దాదాపుగా సమస్యలు సమసిపోతాయి. ప్రతి సమీక్షా సమావేశంలో కూడా సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న దానిపై వివరాలు సమర్పించాలి : అధికారులకు సీఎం ఆదేశం. కోవిడ్ తాజా పరిస్థితులపై సీఎంకు వివరాలను అందించిన అధికారులు. రాష్ట్రంలో కోవిడ్ పూర్తిగా అదుపులో ఉందన్న అధికారులు. గత వారంరోజుల్లో దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఏపీ 23 స్థానంలో ఉందన్న అధికారులు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య కేవలం 24 మంది మాత్రమేనని తెలిపిన అధికారులు. వీరంతా కోలుకుంటున్నారని వెల్లడి. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహించామని, చాలా స్వల్ప సంఖ్యలో లక్షణాలు ఉన్నవారిని గుర్తించామన్న అధికారులు. లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నామని వెల్లడి. సీఎం ఆదేశాల మేరకు టెస్టులు పెంచామన్న అధికారులు. ప్రతి వైయస్సార్ క్లినిక్‌లో కూడా 20 ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ఉంచామన్న అధికారులు. 14 ఆర్టీపీసీఆర్ ల్యాబులు పనిచేస్తున్నాయని వెల్లడి. ఎయిర్‌పోర్టులలో విదేశాల నుంచి వచ్చేవారికి టెస్టులు చేస్తున్నామని తెలిపిన అధికారులు. ఆక్సిజన్ యూనిట్లు, పైపులైన్లు, మాస్క్‌లు, మందులు, పీపీఈ కిట్లు ఇవన్నీ కూడా సరిపడా ఉన్నాయని వెల్లడి. కొత్త వేరియంట్లను గుర్తించేందుకు వీలుగా విజయవాడలో పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించిన అధికారులు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేయాలి : సీఎం. ఒక గ్రామానికి వెళ్లిన తర్వాత వైద్యుడు ఏం చేయాలన్నదానిపై నిర్దేశించుకున్న ఎస్‌ఓపీ కచ్చితంగా అమలు కావాలన్న సీఎం. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఏప్రిల్ 6 నుంచి 28 వరకూ 20,25,903 మందికి సేవలు. 10,032 గ్రామాల్లో వైద్య సేవలు అందించిన ఫ్యామిలీ డాక్టర్. డయాబెటిక్ మరియు హైపర్ టెన్షన్... రెండింటితో బాధపడుతున్న వారు 4,43,232 మంది ఉన్నట్టు గుర్తింపు. హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్న వారు 4,86,903 మంది, మధుమేహంతో 2,70,818 మంది బాధపడుతున్న వారు గుర్తింపు. వారికి వైద్యం, మందులు ఫ్యామిలీ డాక్టర్ ద్వారా అందజేత. ఓరల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 4,649 మంది, బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 1761, సెర్వికల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 7042 మందికి సేవలు. గ్రామాల్లోకి ఫ్యామిలీ డాక్టర్ వెళ్తున్నప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజస్‌తో ఉన్న వారిని గుర్తించి.. వారిపై ప్రత్యేక దృష్టిపెడుతున్నామన్న అధికారులు. వీరి వివరాలు నమోదు చేసుకుని వారికి ఆరోగ్య సేవలు అందేలా తగిన చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. వీరు ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వచ్చి వైద్యం తీసుకునేలా నిరంతరం ఫాలో అప్ చేస్తున్నామన్న అధికారులు. ఫ్యామిలీ డాక్టర్ వచ్చేముందు ఎప్పుడు వస్తున్నారన్న దానిపై ముందుగానే తేదీలు ఇవ్వాలన్న సీఎం. ఆ తేదీలను ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంల ద్వారా గ్రామాల్లో ప్రజలకు తెలిపేలా చేయాలన్న సీఎం. దీనివల్ల వారు ఫ్యామిలీ డాక్టర్ వద్దకు వచ్చి వైద్యం పొందుతారన్న సీఎం. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి జిల్లాల్లో సమర్థులైన అధికారులు ఉండేలా చూసుకోవాలని సీఎం ఆదేశం. అలాగే క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయాలన్న సీఎం. ఎవరికి సమస్య ఉన్నా వారికి వెంటనే పరీక్షలు చేయించాలన్న సీఎం. అవసరమైన వారికి కంటి అద్దాలు ఇవ్వాలన్న సీఎం. నెలకో, రెండు నెలలకోసారి ఈ పరీక్షలు జరగాలన్న సీఎం. దీనిపై కార్యాచరణ చేసి తనకు నివేదించాలని సీఎం ఆదేశం. రక్తహీనత, పౌష్టికాహార లేమిని పూర్తిగా నివారించాలని సీఎం ఆదేశం. విలేజ్ క్లినిక్స్ ద్వారా వీటిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. రక్తహీనతతో బాధపడుతున్న గర్భవతులకు తప్పనిసరిగా పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం. కమ్యూనిటీ హెల్త్‌ఆఫీసర్లను విధి నిర్వహణలో సుశిక్షితులుగా తయారు చేయడానికి ప్రత్యేక కరిక్యులమ్ తయారు చేయాలన్న సీఎం. సీహెచ్‌సీలలో వారికిచ్చిన వైద్య పరికరాలను వినియోగిస్తున్నారా ? లేదా ? అన్నది సమీక్ష చేయాలన్న సీఎం. అందుబాటులోని బోధనాసుపత్రుల్లో వారికి శిక్షణ ఇప్పించాలన్న సీఎం. ఓరల్ హెల్త్‌కేర్, ఈఎన్‌టీ సమస్యలు, వృద్ధాప్యంలో వచ్చే సమస్యలకు వైద్య సేవలు, సీపీఆర్ లాంటి ఎమర్జెన్సీ మెడికల్ సేవలు సహా... వీటన్నింటిపైనా శిక్షణ ఇప్పించాలన్న సీఎం. దీంతోపాటు పాముకాట్లకు సంబంధించి వెంటనే చికిత్స అందించేలా వారిని సుశిక్షితులు చేయాలన్న సీఎం. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలలో నాడు – నేడు పనులపై సీఎం సమీక్ష. కొత్త మెడికల్ కాలేజీల కారణంగా 2100 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయన్న అధికారులు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 2185 మెడికల్ సీట్లకు ఇవి అదనం అని తెలిపిన అధికారులు. ఈ విద్యాసంవత్సంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో తరగతులు ప్రారంభిస్తున్నామన్న అధికారులు. తద్వారా 750 సీట్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపిన అధికారులు. 2024 –25 విద్యా సంవత్సరంలో మరో 350 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయన్న అధికారులు. 2025–26 విద్యాసంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, మదనపల్లె, పెనుకొండ, పాలకొల్లు, మార్కాపురం, నర్సీపట్నం, అమలాపురం, పార్వతీపురం మెడికల్ కాలేజీల్లో తరగతులు నిర్వహించేందుకు కార్యాచరణతో ముందుకెళ్తున్నామన్న అధికారులు. తద్వారా మరో 1000 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయన్న అధికారులు. నిర్దేశించుకున్న కార్యాచరణతో పనులు ముందుకు సాగాలన్న సీఎం. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ జె నివాస్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్ హరీందిర ప్రసాద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్ రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ డీఎస్‌విఎల్ నరసింహం, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ వి రామిరెడ్డి, డైరెక్టర్ (టెక్నికల్) నాడు నేడు ఆర్ మనోహర రెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ డాక్టర్ బి చంద్రశేఖర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు.