తాడేపల్లి: ఆరోగ్య శ్రీ సేవలను పొందడంపై ప్రతి ఒక్కొరికీ కూడా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ఇందుకోసం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. సెప్టెంబరు 15 నుంచి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అన్నిరకాలుగా సిద్ధంచేసుకోవాలన్నారు. ప్రతి కుటుంబానికీ కూడా ఆరోగ్య శ్రీ సేవలను ఎలా పొందాలన్న దానిపై సమగ్ర వివరాలతో బుక్‌లెట్ అందిందాలని సీఎం ఆదేశించారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందడం ఎలా? అన్నదానిపై ప్రతి ఒక్కరికీ కూడా అవగాహన ఉండాలన్నారు. విలేజ్ క్లినిక్ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా పూర్తి వివరాలతో సమాచారం అందించాలని సూచించారు. వీళ్లు ప్రతి ఇంటికీ వెళ్లికూడా ఆరోగ్య శ్రీ గురించి సవివరంగా తెలియజేయాలన్నారు. అనారోగ్యం వచ్చినా, దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగినా ఆరోగ్య శ్రీ కింద ఎలా చికిత్స పొందాలన్నదానిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని సూచించారు. వారు ఉంటున్న ప్రాంతానికి అత్యంత సమీపంలోని నెట్‌వర్క్ ఆస్పత్రిలో ఎలా చికిత్స అందుకోవాలన్నదానిపై అవగాహన ఉండాలి, ప్రజలకూ తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు. - ఆరోగ్య శ్రీ సేవలపై సంపూర్ణ సమాచారం తెలియడమే కాదు, సమర్థవంతంగా సేవలు అందుకోవడం దీని లక్ష్యం. - ఆరోగ్య శ్రీ సేవలు అందుకోవడం ఎలా? అన్న విషయం తెలియని వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదు, దీనికోసం విస్తృత ప్రచారం నిర్వహించండి: - రాష్ట్రంలో ప్రతికుటుంబానికీ దీనిపై బుక్‌లెట్ అందించాలన్న సీఎం. - ఒక్క యాప్‌ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా, ఇతర కాల్ సెంటర్ల ద్వారా కూడా ఆరోగ్య శ్రీ సేవలు పొందడంపై పూర్తి అవగాహన ఉండాలి: - ఆరోగ్య శ్రీ కింద అందే చికిత్సల సంఖ్యను ఈ ప్రభుత్వం రాకముందు 1000 ఉంటే, ఇప్పుడు 3,255కి పెంచాం: సీఎం - ఈసేవలను పొందడంపై ప్రజలకు పూర్తి అవగాహన, సమాచారం ఉండాలి: - సేవలు పొందడంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, లంచాల ప్రస్తావన వచ్చినా ఫిర్యాదు చేసేందుకు ఉద్దేశించిన నంబర్లనుకూడా ప్రజలకు తెలియచెప్పాలి: - నెట్‌వర్క్ ఆస్పత్రులు వారి వారి పరిధిలో తప్పనిసరిగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలి: - ఇది కచ్చితంగా అమలయ్యేలా చూడాలి: - విలేజ్ క్లినిక్స్, సచివాలయ సిబ్బంది సమన్వయం చేసుకుని ఈశిబిరాలు అమలు జరిగేలా చూడాలి: సీఎం నూతన మెడికల్ కాలేజీలు, నిర్వహణ - ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్వహణ అత్యంత సమర్థవంతంగా ఉండాలన్న సీఎం - నిర్వహణకు నిధులు సమస్యరాకుండా చూసుకునేందుకు ఒక విధానం తీసుకురావాలని అధికారులకు ఆదేశం - నిర్మాణాలు చేయడం, పరికరాలు ఏర్పాటు చేయడం అన్నది ఎంత ముఖ్యమో, వాటిని ఉత్తమంగా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం: - అలా చేయకపోతే పరిస్థితులు మళ్లీ మొదటి వస్తాయన్న సీఎం - ఆయా ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద అందించే సేవలకు గాను ప్రభుత్వం నుంచి వాటికి వెళ్లే నిధులు ఆయా ఆస్పత్రుల నిర్వహణకు వినియోగించేలా ఒక పద్ధతిని తీసుకురావాలన్న సీఎం - ఇలా చేయకపోతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు నిర్వహణ నాణ్యతతో చేయడం కష్టం అవుతుందన్న సీఎం. - అలాగే ప్రభుత్వ విద్యాసంస్థలకు ఇచ్చే ఫీజు రియింబర్స్‌మెంట్ డబ్బుల్లో కూడా కొంత ఆయా సంస్థల నిర్వహణకు వినియోగించేలా ఒక విధానం తీసుకురావాలన్న సీఎం. - శస్త్రచికిత్స తర్వాత విశ్రాంతికాలానికి గాను ఆరోగ్య ఆసరా పథకం కింద రోగికి ఇవ్వాల్సిన డబ్బును డిశ్చార్జి రోజే అందించాలని సీఎం ఆదేశం. - దీనికి కావాల్సిన ఎస్‌ఓపీని రూపొందించాలని అధికారులకు ఆదేశం. - ప్రభుత్వ రంగంలో కొత్తగానిర్మిస్తున్న 17 మెడికల్ కాలేజీల నిర్మాణాల్లో ప్రగతి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో నాడు – నేడు పనులు, ఇతర స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మాణాలపై సీఎం సమీక్ష. - కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోందని తెలిపిన అధికారులు. - ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు అనూహ్య స్పందన వస్తోందన్న అధికారులు. - సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సుల్లోనూ ప్రైవేటు కాలేజీల్లో కన్నా, ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల్లో చేరేందుకే ఆసక్తి చూపిస్తున్నారన్న అధికారులు. - ఈ ఏడాది విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాలలోని ఐదు మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు. - వచ్చే ఏడాది మరో ఐదు మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు సిద్ధం అవుతున్నామన్న అధికారులు. - పులివెందుల, పాడేరు, ఆదోని, మార్కాపూర్ మదనపల్లెల్లో వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలకు సిద్ధం అవుతున్నామన్న అధికారులు. - 2025-26 విద్యా సంవత్సరంలో మిగిలిన మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తిచేసుకుని ప్రవేశాలకు సిద్ధం అవుతున్నాయన్న అధికారులు. - పాలకొల్లు, పార్వతీపురం మెడికల్ కాలేజీలో కూడా పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశం.