కేసులు అధికంగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టిపెట్టండి

కరోనా నియంత్రణ సమీక్షలో అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: కరోనా పాజిటివ్‌ కేసులు అత్యధికంగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టిసారించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌ను శాశ్వత ప్రాతిపదికన నడపాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన జిల్లాల్లోనూ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అనుమతించిన ప్రాంతాల్లో భౌతికదూరం పాటిస్తూ పరిశ్రమలు, వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగేలా చూడాలని అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top