పంట‌లు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి రాకూడ‌దు

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

ధాన్యం సేకరణ, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలపై వ్యవసాయ, పౌరసరఫరాలశాఖలతో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష

ఖరీఫ్‌లో ఇప్పటివరకూ 1.10 కోట్ల ఎకరాల్లో పంటలసాగు

రబీకోసం కూడా అన్నిరకాలుగా సన్నద్ధమయ్యామన్న అధికారులు 
 
ఇ–క్రాపింగ్‌ చేయడం వల్ల ధాన్యం కొనుగోళ్లలో పూర్తిస్థాయిలో పారదర్శకత వచ్చిందన్న సీఎం 

తాడేప‌ల్లి: ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు పంట‌లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఏ రైతు కూడా ఎక్కడా ఫిర్యాదు చేయకూడదని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం సేకరణ, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలపై వ్యవసాయ, పౌరసరఫరాలశాఖలతో  క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు.

  • రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులను సీఎంకు వివరించిన అధికారులు.
  • ఖరీఫ్‌లో ఇప్పటివరకూ 1.10 కోట్ల ఎకరాల్లో పంటలసాగు.
  • ఇంకా అక్కడక్కడా కొనసాగుతున్న నాట్లు.
  • సాధారణ సాగు 1.15 కోట్ల ఎకరాలకు ఈ సీజన్‌లో చేరుకుంటుందని వివరించిన అధికారులు. 
  • గడచిన మూడేళ్లలో 3.5లక్షల ఎకరాల్లో పెరిగిన ఉద్యానవనసాగు. సాధారణ పంటలనుంచి ఉద్యానవన పంటలవైపు మళ్లిన రైతులు.
  • రబీకోసం కూడా అన్నిరకాలుగా సన్నద్ధమయ్యామన్న అధికారులు.
  • 57.31లక్షల ఎకరాల్లో రబీ సాగు విస్తీర్ణంగా అంచనా వేస్తున్నామన్న అధికారులు.
  • 96 లక్షల మెట్రిక్‌ టన్నుల విత్తనాలు సిద్ధంచేశామని వెల్లడించిన అధికారులు.

ఇ–క్రాపింగ్‌ తీరును వివరించిన అధికారులు.

  • సాగుచేసిన పంటల్లో వీఏఏ, వీఆర్‌ఓలు  99 శాతానికిపైగా ఆధీకృతం పూర్తిచేశారని తెలిపిన అధికారులు.
  • ఈ నెల 15వ తేదీలోగా రైతుల అథంటికేషన్‌ కూడా పూర్తిచేసి, వారికి డిజిటల్‌ మరియు ఫిజికల్‌ రశీదులు కూడా ఇవ్వాలని సీఎం ఆదేశం.
  • అనంతరం పకడ్బందీగా సోషల్‌ఆడిట్‌ కూడా పూర్తిచేయాలన్న సీఎం. 
  • నిర్దేశించుకున్న టైంలైన్‌ ప్రకారం ఈ ప్రక్రియను పూర్తిచేయాలని సీఎం ఆదేశం.

ఖరీప్‌ ధాన్యం కొనుగోళ్లపై సీఎం సమీక్ష.

  • 14.10 లక్షల హెక్టార్లలో వరి పండించారని అంచనా.
  • నవంబరు  మొదటివారం నుంచి కొనుగోళ్లు చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంచేశామన్న అధికారులు.
  • ధాన్యం కొనుగోళ్లకోసం 3,423 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తున్నామన్న అధికారులు.
  • మాయిశ్చరైజర్‌ మీటర్, అనాలసిస్‌ కిట్,  హస్క్‌ రిమూవర్, పోకర్స్, ఎనామెల్‌ ప్లేట్స్, జల్లించే పరికరాలతో సహా వీటన్నింటినీ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నామన్న అధికారులు.
  • ఇ–క్రాపింగ్‌ చేయడం వల్ల ధాన్యం కొనుగోళ్లలో పూర్తిస్థాయిలో పారదర్శకత వచ్చిందన్న సీఎం. 
  • ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఏ రైతు కూడా ఎక్కడా ఫిర్యాదు చేయకూడదన్న సీఎం. 
  • గన్నీబ్యాగులు, కూలీలు, రవాణా.. అవసరమైన మేరకు ఇవన్నీ కూడా సమకూర్చుకోవాలన్న సీఎం. 
  • ధాన్యం కొనుగోళ్లలో సహాయంకోసం తీసుకుంటున్న వారిని రైతు సహాయకులుగా వ్యవహరించాలన్న సీఎం
  • ధాన్యం కొనుగోళ్లపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశం.
  • రైతు భరోసా కేంద్రాల్లో ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించాలన్న సీఎం
  • ధాన్యం కొనుగోళ్లపై ఆర్బీకేల్లో పోస్టర్లుకూడా పెట్టాలన్న సీఎం. 
  • రాష్ట్రంలో విస్తారంగా వరి సాగు అవుతున్నందున బియ్యం ఎగుమతులపైనా దృష్టిపెట్టాలన్న సీఎం.
  • దేశీయంగా డిమాండ్‌ లేని పరిస్థితుల్లో విదేశాలకు ఎగుమతిచేసే అవకాశాలపైనా దృష్టిపెట్టాలన్న సీఎం.
  • ఈ విషయంలో ఎగుమతులు రంగంలో ఉన్న ఇతర కంపెనీలతో కలిసి పనిచేయాలన్న సీఎం. 
  • ఇది రైతులకు ఉభయతారకంగా ఉంటుందన్న సీఎం.

బ్రోకెన్‌ రైస్‌ను ఇథనాల్‌ తయారీకి వినియోగించడంపై దృష్టి పెట్టాలన్న సీఎం.

  • ఇప్పటికే ఇఫ్కో ద్వారా ఒక ప్లాంటు, మహీంద్రా ద్వారా మరో ప్లాంటు నుంచి ఇథనాల్‌ తయారీ కాబోతుందన్న సీఎం.
  • రంగు మారిన ధాన్యం, బ్రోకెన్‌ రైస్‌ నుంచి ఇథనాల్‌ తయారీపై దృష్టి పెట్టాలన్న సీఎం  
  • ఎక్కడైనా పంటలకు ఎంఎస్‌పీ కన్నా తక్కువ వస్తుందని అంటే.. కచ్చితంగా జోక్యంచేసుకుని ఎంఎస్‌పీ ధరలకు కొనుగోలు చేయాలన్న సీఎం.
  • ఎక్కడైనా ధర రాని పక్షంలో, సీఎంయాప్‌ ద్వారా ఫిర్యాదు రాగానే  రైతును ఎలా ఆదుకుంటామనే విషయంలో ఎస్‌ఎల్‌ఏ పకడ్బందీగా ఉండాలన్న సీఎం. 
  • కొనుగోలు చేసిన సరుకును నిల్వచేసే ప్రాంతంలో జియోఫెన్సింగ్, అలాగే ఉత్పత్తులకు క్యూ ఆర్‌ కోడ్‌ కూడా ఉంటుందన్న అధికారులు. 
  • ఇదే తరహా విధానాన్ని పౌరసరఫరాలశాఖలో కూడా పాటించాలన్న సీఎం. 

పొగాకు రైతులకు నష్టంరాకుండా తగిన రీతిలో చర్యలు తీసుకోవాలన్న సీఎం. 

  • రైతులను ఆదుకునేందుకు మార్కెట్లో నిరంతరం జోక్యం చేసుకోవాలన్న సీఎం
  • దీనివల్ల ధరలు పతనం కాకుండా రైతులకు మేలు జరుగుతుందన్న సీఎం. 
  • అక్టోబరు 17న ఈ ఏడాది రైతు భరోసా రెండో విడతకు  అన్నిరకాలుగా సిద్ధం అవుతున్నామన్న అధికారులు.
  • వైయస్సార్‌ యంత్రసేవకు సంబంధించిన పోస్టర్లను ఆర్బీకేల్లో ఉంచామన్న అధికారులు
  • ఆర్బీకేల్లో అందుబాటులో ఉన్న యంత్రాలు, వాటి సేవలకు అయ్యే ఖర్చు తదితర వివరాలతో పోస్టర్లను ఆర్బీకేల్లో ఉంచామన్న అధికారులు. 
  • ఆర్బీకేల్లో సేవలందిస్తున్న వారిని ఆర్బీకే మిత్రలుగా వ్యవహరించాలని నిర్ణయం.

సాయిల్‌ డాక్టర్‌ విధానంపై సమావేశంలో చర్చ.

  • ఖరీఫ్‌ ప్రారంభం కాకముందే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు పూర్తికావాలి: సీఎం
  • ప్రతి ఏటా కూడా ఇలాగే పరీక్షలు చేయాలి: సీఎం
  • దీనికి సంబంధించిన వివరాలను సంబంధిత కార్డులో రికార్డు చేయాలి:సీఎం
  • భూసార పరీక్ష ఫలితాలను పరిగణలోకి తీసుకుని ఎలాంటి పంటలు వేయాలి? ఎంత మోతాదులో ఎరువులు వేయాలన్న దానిపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి, పంటల సాగుకు సంబంధించి సిఫార్సులు చేయాలి: సీఎం
  • ఈ విధానాన్ని పటిష్టంగా అమలు చేయడం కోసం దేశంలో ప్రసిద్ధ చెందిన బాంబే ఐఐటీ, కాన్పూర్‌ ఐఐటీలో కొన్ని సాంకేతిక విధానాలను పరిశీలించామని తెలిపిన అధికారులు.

ప్రతి ఆర్బీకేలో సాయిల్‌ టెస్టింగ్‌ డివైజ్‌ పెట్టాలన్న సీఎం 

  • దీనివల్ల విచక్షణ రహితంగా ఎరువులు, రసాయనాల వాడకం తగ్గుతుందన్న సీఎం
  • తద్వారా రైతులకు పెట్టబడులుతగ్గి, ఖర్చులు తగ్గుతాయన్న సీఎం
  • అంతేకాక మంచి వ్యవసాయ ఉత్పత్తులను సాధించడానికి అన్నిరకాలుగా ఈ విధానం ఉపయోగపడుతుందన్న సీఎం.  

ఈ సమీక్షా సమావేశంలో పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ఛైర్మన్‌ ఎం వి యస్‌ నాగిరెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి(మార్కెటింగ్, సహకారం) చిరంజీవిచౌదరి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్న, సివిల్‌ సఫ్లైస్‌ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్‌ హరికిరణ్, సివిల్‌ సఫ్లైస్‌ వీసీ అండ్‌ ఎండీ జీ వీరపాండ్యన్, ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్‌ వీసీ అండ్‌ ఎండీ జి శేఖర్‌బాబు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top