రైతన్నకు ఏ కష్టం రాకూడదు

అన్ని పంటల కొనుగోళ్లకు కూపన్ల విధానాన్ని వర్తింపజేయాలి

వ్యవసాయ శాఖ సమీక్షలో అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: అన్నదాతకు ఏ కష్టం రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయం - అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రైతుల ఇబ్బందులపై ఎక్కడి నుంచి సమాచారం వచ్చినా సమస్య పరిష్కరించడంపై దృష్టిపెట్టాలి. వీలైనంత త్వరగా మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ యాప్‌ ద్వారా సమాచారాన్ని తెప్పించుకునేందుకు ప్రయత్నాలు చేయాలి. 1902 నంబర్‌ను గ్రామ సచివాలయాల్లో బాగా ప్రచారం చేయాలి. కష్టం ఉందని రైతులు ఫోన్‌ చేసి చెప్పినా వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

కూపన్లు జారీ చేసి పంటలు కొనుగోళ్ల చేసే విధానం పట్ల రైతుల్లో మంచి సానుకూలత ఉందని అధికారులు సీఎంకు వివరించారు. అన్ని పంటలకూ కూపన్ల విధానాన్ని వర్తింప జేయాలని సీఎం ఆదేశించారు. రోజుకు 60 వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, రోజుకు 8 వేల టన్నుల మొక్కజొన్నను సేకరిస్తున్నామని అధికారులు వివరించారు. వీలైనంతమేర ధాన్యాన్ని సేకరించాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top