ఉన్న‌తాధికారుల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: ఉక్రెయిన్‌లో విద్య కోసం వెళ్లి అక్కడ చిక్కుకున్న ఏపీ విద్యార్థులను స్వదేశానికి క్షేమంగా తీసుకొచ్చేందుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉన్న‌తాధికారుల‌తో   స‌మీక్ష నిర్వ‌హించారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో స‌మావేశం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థుల‌ను ఏపీకి ర‌ప్పించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపట్టింది. అక్కడి ఏపీ విద్యార్థులతో ఎప్పటికప్పుడు అధికారులు మాట్లాడుతూ వారిలో ధైర్యాన్ని నింపే కార్యక్రమాన్ని చేప‌ట్టారు.   ఇప్పటికే  సీఎం వైయ‌స్‌ జగన్‌ ఏపీ విద్యార్థులను క్షేమంగా తీసుకొచ్చే విషయమై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ కూడా రాశారు.  

Back to Top